Ram Charan Daughter Name: సస్పెన్స్ కి తెరదించుతూ.. కూతురి పేరు రివీల్ చేసిన చరణ్ – ఉపాసన!

రాంచరణ్ ఉపాసన దంపతులు జూన్ 20వ తేదీన తల్లిదండ్రులగా ప్రమోషన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆరోజున ఉపాసన పండంటి ఆడపిల్లకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీలో సంతోషం వెల్లువిరిసింది. దాదాపు పెళ్లైన పది సంవత్సరాల తర్వాత చరణ్ – ఉపాసన తల్లిదండ్రులు అవ్వడంతో చిరంజీవి – సురేఖ ఎంతో సంతోషపడ్డారు. ఇప్పటికే తమ చిన్నారికి పేరును కూడా ఫిక్స్ చేసినట్లు మొన్న అపోలో హాస్పిటల్ వద్ద చరణ్ మీడియా ముందు చెప్పారు.

ఇక ఈరోజున రామ్ చరణ్ (Ram Charan) కుమార్తె బారసాల వేడుకను నిర్వహించబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ఉపాసన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరోపక్క పాపకు ఏం పేరు పెడతారు అనే ఆసక్తి కూడా అందరిలోనూ పెరిగింది. ఇక తాజా సమాచారం ప్రకారం.. చరణ్ – ఉపాసన ల కూతురికి క్లిన్ కారా (క్లీం..కార) అంటూ నామకరణం చేసినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని చరణ్ – ఉపాసన తెలియజేసారు.

లలిత సహస్రనామం నుండి ఈ పేరుని తీసుకున్నట్లు తెలుస్తుంది. పాజిటివ్ ఎనర్జీని అలాగే ఆధ్యాత్మికతను నింపేలా చరణ్ – ఉపాసన లు ఈ పేరు పెట్టినట్లు తెలుస్తుంది. పేరు వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా.. ఇందులో మంచి మీనింగ్ ఉన్నట్టు అంతా చెప్పుకుంటున్నారు. ఇక క్లిన్ కారా బారసాలకి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అందులో ఆ పేరుకు అర్థం తెలుపుతూ కూడా ఓ ఫోటోను షేర్ చేశారు మెగా కుటుంబ సభ్యులు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus