Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » క్లీంకార ఆగ‌మ‌నాన్ని అంద‌మైన వీడియోతో ప‌రిచ‌యం చేసిన రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌

క్లీంకార ఆగ‌మ‌నాన్ని అంద‌మైన వీడియోతో ప‌రిచ‌యం చేసిన రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌

  • July 20, 2023 / 06:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్లీంకార ఆగ‌మ‌నాన్ని అంద‌మైన వీడియోతో ప‌రిచ‌యం చేసిన రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తుల జీవితంలో జూన్ 20 ఎంతో కీల‌కం. ఎందుకంటే ఆరోజున క్లీంకార పుట్టుక‌తో వారు త‌ల్లిదండ్రులుగా జీవితంలో కొత్త అంకాన్ని ప్రారంభించారు. దీనిపై మెగాభిమానులు, కుటుంబ స‌భ్యులు ఎంతో ఆనందంగా ఉన్నారు. కాగా గురువారం (జూలై 20) రోజున‌ వీరు క్లీంకార ఆగ‌మ‌నానికి సంబంధించిన హృద‌యానికి హ‌త్తుకునే అంద‌మైన వీడియోను విడుద‌ల చేశారు. యాదృచ్చికంగానే జ‌రిగిన‌ప్ప‌టికీ గురువారంతో పాప పుట్టి నెల రోజులే అవుతుంది. గురువారం రోజునే ఉపాస‌న పుట్టిన‌రోజు కావ‌టం విశేషం. క్లీంకార వన్ మంత్ బ‌ర్త్ యానివ‌ర్స‌రీ వీడియోను టాలెంటెడ్ ఫిల్మ్ మేక‌ర్‌ జోసెఫ్ ప్ర‌త‌నిక్ డైరెక్ట్ చేసి నిర్మించారు.

ఈ వీడియోలో లెజెండ్రీ యాక్ట‌ర్ మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న సతీమ‌ణి సురేఖా కొణిదెలతో పాటు ఉపాస‌న త‌ల్లిండ్రులు శోభా కామినేని, అనీల్ కామినేని కూడా ఉన్నాయి. కుటుంబ స‌భ్యులంద‌రూ ఉన్నారు. అంద‌ద‌రిలోనూ ఎగ్జ‌యిట్‌మెంట్‌, ఆనందం ఉండ‌టాన్నిమ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. క్లీంకార పుట్టిన త‌ర్వాత కుటుంబ స‌భ్యులు, అభిమానులు అంద‌రూ పండుగ చేసుకున్నారు. వాట‌న్నింటినీ వీడియోలో అందంగా చూపించారు.

ఈ భావోద్వేగం గురించి మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ “క్లీంకార పుట్టే స‌మ‌యంలో మా అంద‌రిలోనూ తెలియ‌ని టెన్ష‌న్‌. అంతా స‌రిగ్గా జ‌ర‌గాల‌ని మేం అంద‌రూ ప్రార్థిస్తున్నాం. అందుకు త‌గిన‌ట్టే అన్నీ అనుకూలంగా మారి స‌రైన స‌మ‌యం కుద‌ర‌టంతో పాప ఈ లోకంలోకి అడుగు పెట్టింద‌ని భావిస్తున్నాను. పాప పుట్టిన ఆ క్ష‌ణం మ‌న‌సుకి ఆహ్లదంగా, చాలా సంతోషంగా అనిపించింది. పాప పుట్ట‌టానికి ప‌ట్టిన 9 నెల‌ల స‌మ‌యం, అప్పుడు జ‌రిగిన ప్రాసెస్ అంతా త‌లుచుకుని హ్యాపీగా ఫీల‌య్యాం“ అన్నారు.

క్లీంకార రాకకు దారి తీసిన ఆ మ‌ర‌పురాని క్ష‌ణాల‌తో పాటు, పాప‌కు ఆ పేరు పెట్ట‌టానికి కార‌ణ‌మైన అస‌లు క‌థ‌ను కూడా వీడియోలో మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. భార‌త‌దేశంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, ఒడిస్సా ప్రాంతాల్లో నివ‌సిస్తున్న చెంచు జాతి నుంచి స్ఫూర్తిని పొందారు. స‌ద‌రు చెంచు జాతి ద్రావిడు సంస్కృతిలో భాగం. వారి సంస్కృతిలోని గొప్ప‌త‌నం, విలువ‌లే పాపకు ఆ పేరు పెట్ట‌టానికి కార‌ణ‌మ‌య్యాయి.

ఈ సంద‌ర్భంగా ఉపాస‌న కొణిదెల మాట్లాడుతూ “మా పాప ద్రావిడ సంస్కృతిలో భాగం కావాల‌ని నేను కోరుకున్నాను. ఆమె పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగుల‌ను ఇవ్వ‌కండి. అలాంటి వాటిని వారే స్వ‌యంగా సాధించుకోవాల‌ని నా అభిప్రాయం. పిల్ల‌ల పెంప‌కంలో ఇవెంతో ముఖ్య‌మైన‌వి. జీవితంలో ప్ర‌తీ క్ష‌ణాన్ని ఆస్వాదించాలి.మ‌నం అంద‌రితో క‌లిసి సంతోషంగా ఉన్న స‌మ‌యానికి విలువ ఇవ్వాల‌ని నేను భావిస్తాను“ అన్నారు.

వారి కుటుంబాల‌కు సంబంధించిన ప్ర‌త్యేక‌మైన వీడియోను ప్ర‌జ‌ల‌కు చూపించ‌టం ద్వారా రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌ల‌ను నెటిజ‌న్స్ అభినందిస్తున్నారు. అభిమానులు, ప్రేక్ష‌కులు, స్నేహితులు, స‌న్నిహితులు, కుటుంబ స‌భ్యులు చూపిస్తున్న ఈ ప్రేమాభిమానాల‌పై చ‌ర‌ణ్, ఉపాస‌న కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

View this post on Instagram

A post shared by Ram Charan (@alwaysramcharan)

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Klin Kaara
  • #Ram Charan
  • #Upasana

Also Read

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు.. ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

related news

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

trending news

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

32 mins ago
Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు.. ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

5 hours ago
Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

22 hours ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

23 hours ago
Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

24 hours ago

latest news

Sameera Reddy : ఆ సమస్య వల్ల నేను ఎన్నో వేధింపులకు గురయ్యాను : సమీరా రెడ్డి

Sameera Reddy : ఆ సమస్య వల్ల నేను ఎన్నో వేధింపులకు గురయ్యాను : సమీరా రెడ్డి

3 mins ago
Singer Mangli: స్కామ్‌ ఆరోపణలు.. స్పందించిన సింగర్‌ మంగ్లీ.. ఏం చెప్పారంటే?

Singer Mangli: స్కామ్‌ ఆరోపణలు.. స్పందించిన సింగర్‌ మంగ్లీ.. ఏం చెప్పారంటే?

3 hours ago
Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

3 hours ago
Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

3 hours ago
Pawan Kalyan: కొత్త సినిమా పుకార్లు… విచిత్రమైన క్లారిటీ ఇచ్చిన పవన్‌ సొంత బ్యానర్‌

Pawan Kalyan: కొత్త సినిమా పుకార్లు… విచిత్రమైన క్లారిటీ ఇచ్చిన పవన్‌ సొంత బ్యానర్‌

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version