Ram Charan: పంచెకట్టుతో సైకిల్ పై రామ్ చరణ్.. ఫొటో వైరల్!

  • April 5, 2022 / 05:07 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో అల్లూరి గెటప్ లో రామ్ చరణ్ సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి. ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు. దర్శకుడు శంకర్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు రామ్ చరణ్. ఈ సినిమాలో రామ్ చరణ్ కి సంబంధించిన ఓ షాకింగ్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఫొటోలో రామ్ చరణ్ పంచెకట్టులో కనిపించారు. అచ్చం పల్లెటూరి వ్యక్తిలా పంచెకట్టుకొని సైకిల్ పై కనిపించాడు. ఈ లుక్ చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ లుక్ RC15 మూవీ సెట్స్ నుంచి లీకైనట్లు తెలుస్తోంది. కథ ప్రకారం.. ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు గెటప్స్ లో కనిపించబోతున్నాడని చెబుతున్నారు. అందులో ఒకటి స్టూడెంట్ రోల్ అని.. మరొకటి గవర్నమెంట్ ఆఫీసర్ రోల్ అని తెలుస్తోంది.

మరి ఈ పంచెకట్టు గెటప్ దేనికి సంబంధించిందో సినిమా చూస్తే కానీ క్లారిటీ రాదు. ఈ సినిమాలో ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని.. అందులో చరణ్ ఈ గెటప్ లో కనిపిస్తాడని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాల షూటింగ్ ను నిర్వహించారు.

పూణే, హైదరాబాద్, రాజమండ్రి ప్రాంతాల్లో షూటింగ్స్ ను నిర్వహించారు. ఈ సినిమాలో సాంగ్స్, ఫైట్స్ ఓ రేంజ్ లో ఉంటాయని చెబుతున్నారు. వీటికోసమే శంకర్ కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారట. అనుకున్నట్లుగా షూటింగ్ ను పూర్తి చేయగలిగితే.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్. మరేం జరుగుతుందో చూడాలి!

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus