Upasana: బేబీ బంప్ ను కవర్ చేస్తున్న ఉపాసన.. లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

రాంచరణ్- ఉపాసన .. టాలీవుడ్లో ఉన్న బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరు. ఈ ఏడాది జూన్ 14 కి ఈ దంపతులు పెళ్లి చేసుకుని 10 ఏళ్ళు పూర్తయ్యింది. అయితే ఫ్యాన్స్ లో ఒక్కటే బాధ. ఎందుకు ఈ దంపతులు పిల్లల్ని కనలేదు అని..! మొత్తానికి వాళ్ళ కోరిక తీరబోతుంది. రాంచరణ్ – ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఇటీవల చిరంజీవి ప్రకటించారు. ఈ వార్త తెలీగానే అంతా సంతోషించారు. కానీ ఉపాసన సరోగసి పద్దతిలోనే తల్లి కాబోతుంది అంటూ కొంతమంది బాంబ్ పేల్చారు.

దీంతో ఈ వార్త చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ వార్తల పై ఉపాసన కానీ మెగా ఫ్యామిలీకి సంబంధించిన వారు ఎవ్వరూ కూడా స్పందించలేదు. ఫైనల్ గా ఉపాసన.. ఒక్క ఫొటోతో ఆ వార్తల్లో నిజం లేదు అని చెప్పకనే చెప్పింది. ఇటీవల ఉపాసన తన కజిన్ విరాజిత్ వెడ్డింగ్ లో పాల్గొంది. అప్పుడు ఈమె బేబీ బంప్ తో కనిపించింది. ఆ ఫోటోలు బయటకు రాగానే సరోగసి వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్టు అయ్యింది.

అంతేకాకుండా తాజాగా రాంచరణ్ తో ఉపాసన కలిసున్న ఇంకొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇందులో ఉపాసన తన బేబీ బంప్ ను కవర్ చేసే విధంగా డ్రెస్ వేసుకుంది.అలాగే తన పెట్ ను ఎత్తుకున్నట్టు ఫోజు ఇచ్చింది. ఒక గుడ్ న్యూస్ తో ఈ సంవత్సరానికి గుడ్ బై చెప్పినట్టు అలాగే నూతన ఉత్సాహంతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నట్టు.. తెలిపి కొత్త ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus