Ram Charan: ఆ మూవీలో రంగస్థలం లుక్ ను మరిపించేలా చరణ్ లుక్ ఉండబోతుందా?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కు (Ram Charan) ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా రామ్ చరణ్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. చరణ్ బుచ్చిబాబు (Buchi Babu)  కాంబో మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ లుక్ ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చింది. చరణ్ లేటెస్ట్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండగా చరణ్ బెస్ట్ లుక్ లోడింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Ram Charan

గుబురు గడ్డంతో చరణ్ లుక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఫైనల్ లుక్ లాక్ కావాల్సి ఉంది. రంగస్థలం (Rangasthalam) లుక్ ను మరిపించే విధంగా రామ్ చరణ్ లుక్ ఉండబోతుందని క్లారిటీ వచ్చేసింది. చరణ్ తన లుక్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సినిమాలకు అనుగుణంగా లుక్ ను మార్చుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ మైత్రీ మూవీ మేకర్స్, వ్రిద్ధి సినిమాస్, సుకుమార్ (Sukumar) రైటింగ్స్ బ్యానర్లపై తెరకెక్కనుంది.

చరణ్ బుచ్చిబాబు మూవీ ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతుండగా ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ (RC16/Peddi)  300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ మిస్ చేసుకున్న కథతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా కథకు సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి రాగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

ఉప్పెన (Uppena) సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కాగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్టవ్వడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ నిజ జీవితం నుండే ‘పుష్ప’ క్యారెక్టర్ పుట్టిందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus