ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ గురించి వర్మ టెన్షన్

“నేనేం చేసినా పబ్లిసిటీ కోసమే” అని వర్మ ఒకానొక సందర్భంలో చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అంత త్వరగా మర్చిపోవడం కూడా కష్టం అనుకోండి. రీసెంట్ గా వర్మ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా “లక్ష్మీస్ ఎన్టీఆర్” అనే సినిమాను మొదలెట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రం పోస్టర్స్, టీజర్ సినిమా మీద అంచనాలను పెంచింది. అయితే.. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ మాత్రం విడుదలవ్వలేదు. దాంతో ట్రైలరే ఇప్పటివరకు విడుదల చేయకపోతే.. ఇంక సినిమా ఎప్పుడు విడుదల చేస్తావ్ వర్మ అని కొందరు అడిగిన ప్రశ్నకి వర్మ తన తరహాలో చాలా టిపికల్ గా.. “ఎన్టీఆర్ మహానాయకుడు” విడుదల రోజు ట్రైలర్ రిలీజ్ చేద్దామని ఎప్పుడో రెడీ చేసి పెట్టుకొన్నాను. కానీ ఇప్పటివరకూ ఆ సినిమా విడుదల విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. వాళ్లెప్పుడు సినిమా విడుదల చేస్తే నేను ఆ రోజు ట్రైలర్ రిలీజ్ చేయడం ఖాయం. దయచేసి ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రానికి త్వరగా రిలీజ్ చేయండి” అని వ్యంగ్యంగా ఓ ట్వీట్ వేశాడు వర్మ.

ఆర్గీజీ తాను “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా మొదలెట్టినప్పటినుంచీ నందమూరి బాలకృష్ణను, నారా చంద్రబాబు నాయుడ్ని ఏదో ఒక విధంగా టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే కెలుకుతూనే ఉన్నాడు. అయితే.. మొన్నటివరకూ ఉన్న సిచ్యుయేషన్ వేరు.. ఇప్పుడు పరిస్థితి వేరు. అసలే ఫస్ట్ పార్ట్ ఫ్లాప్ అయ్యిందన్న బాధలో బాలయ్య & టీం ఉండగా వర్మ ఇలా వారిని కెలకడం ఎంతమాత్రం భావ్యం కాదని కొందరు అభిప్రాయపడుతుండగా.. వర్మ ఫాలోవర్స్ మాత్రం ఆయన అంతే అలానే చేస్తాడు అని సపోర్ట్ చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus