Rama Rajamouli: రాజమౌళి మాత్రమే కాదు ఆమె భార్యలో కూడా నటి ఉంది.. ఇదిగో ప్రూఫ్..!

  • June 21, 2021 / 03:56 PM IST

దేశం గర్వించదగ్గ దర్శకుడిగా ఎదిగాడు ఎస్.ఎస్.రాజమౌళి. ‘బాహుబలి’ తో అతను తెలుగు సినిమా స్థాయిని అలాగే మార్కెట్ ను కూడా పెంచారు. ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి అన్నా.. బాలీవుడ్ లో మన సినిమాలకు డిమాండ్ పెరిగింది అన్నా.. అది రాజమౌళి చలవే..!. అయితే ఆయన సినీ రంగ ప్రవేశం చేసింది ఒక సీరియల్ కారణంగా అంటే.. నమ్మడం కొంచెం కష్టంగానే ఉంటుంది.. కానీ అది నిజమే..! ఇప్పుడంటే డైరెక్టర్ కావాలి అనుకుంటున్న వారు షార్ట్ ఫిలిం, వెబ్ సిరీస్ ల ద్వారా తమ ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నారు.

అయితే సోషల్ మీడియా అంతగా.. ప్రాచుర్యం చెందని రోజుల్లో డైరెక్టర్ కావాలని తపించిన రాజమౌళికి సీరియల్ నే మార్గం చూపించింది.’శాంతినివాసం’ అనే సీరియల్ ను డైరెక్ట్ చేసాడు రాజమౌళి. అంతేకాదు ఆయనలో మంచి నటుడు కూడా ఉన్నాడు అన్న సంగతి తెలిసిందే.’సై’ ‘బాహుబలి’ ‘మజ్ను’ వంటి చిత్రాల్లో అతను గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. అంతకుముందు ‘అమృతం’, ‘యువ’ వంటి సీరియల్స్ లో కూడా రాజమౌళి నటించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా.. రాజమౌళి భార్య రామా రాజమౌళిలో కూడా నటి దాగి ఉంది అన్న సంగతి బహుశా ఎవ్వరికీ తెలిసి ఉండదు.

అవును ఆమె కూడా ఓ సీరియల్ లో నటించింది. ఆ సీరియల్ మరేదో కాదు ‘అమృతం’. గుణ్ణం గంగరాజు తెరకెక్కించిన ఈ సీరియల్ లో రాజమౌళి సోదరుడు కాంచి నటించాడు. అలాగే ఓ ఎపిసోడ్లో రామా రాజమౌళి కూడా నటించింది. ఓ ఎపిసోడ్ లో భాగంగా ఆమె న్యూస్ రీడర్ గా కనిపించడం విశేషం. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :


బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus