‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ల తర్వాత గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రామబాణం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్,వివేక్ కూచిభొట్ల కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 5న ‘రామబాణం’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
జగపతి బాబు, ఖుష్బూ , గెటప్ శ్రీను, అలీ, సప్తగిరి వంటి వారు కీలక పాత్రలు పోషించారు. మొదటి రోజు ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా సో సో గానే వచ్చాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 0.45 cr |
సీడెడ్ | 0.20 cr |
ఉత్తరాంధ్ర | 0.15 cr |
ఈస్ట్ | 0.09 cr |
వెస్ట్ | 0.06 cr |
గుంటూరు | 0.07 cr |
కృష్ణా | 0.08 cr |
నెల్లూరు | 0.04 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.14 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.04 cr |
ఓవర్సీస్ | 0.04 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 1.22 cr (షేర్) |
‘రామబాణం’ చిత్రానికి రూ.15.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.15.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ‘రామబాణం’ చిత్రం రూ.1.22 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.14.28 కోట్ల షేర్ ను రాబట్టాలి. చూస్తుంటే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. రెండో రోజు బుకింగ్స్ ఇంకా దారుణంగా ఉన్నాయి.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?