Ramarao On Duty Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ ..!

  • August 13, 2022 / 11:56 AM IST

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన రీసెంట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’.శరత్ మండవ ఈ చిత్రానికి దర్శకుడు కాగా ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ ‘ఆర్.టి.టీం వర్క్స్’ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. దివ్యాంశ కౌశిక్, రెజిషా విజయన్ లు హీరోయిన్లు. ‘ఖైదీ'(2019) ఫేమ్ సామ్ సి ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 9 ఏళ్ళ తర్వాత సీనియర్ హీరో వేణు ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాడు.

టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. కానీ జూలై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నెగిటివ్ టాక్ ను మూటకట్టుకోవడంతో బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.40 cr
సీడెడ్ 0.74 cr
ఉత్తరాంధ్ర 0.65 cr
ఈస్ట్ 0.43 cr
వెస్ట్ 0.22 cr
గుంటూరు 0.36 cr
కృష్ణా 0.34 cr
నెల్లూరు 0.17 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 4.31 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్(తెలుగు వెర్షన్) 0.88 cr
వరల్డ్ వైడ్ టోటల్ 5.19 cr

‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రానికి రూ.17.72 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.18 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం రూ.5.19 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఫుల్ రన్లో బయ్యర్లకు ఈ చిత్రం బిజినెస్ పై రూ.12.53 కోట్ల నష్టాలను మిగిల్చింది.

మొదటి వీకెండ్ కే దుకాణం సర్ధేసిన ఈ మూవీ వీక్ డేస్ కనీసం నిలబడలేకపోయింది. దీంతో ఫైనల్ గా ఈ చిత్రం ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలింది అని చెప్పాలి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus