Ramya Krishna: తమన్నా పాటకు మైండ్ బ్లోయింగ్ పర్ఫామెన్స్ చేసిన రమ్యకృష్ణ!

సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రమ్యకృష్ణ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. అదే సమయంలో విలన్ గా కూడా నటించి మెప్పించారు.ఇలా ఒకానొక సమయంలో సౌత్ ఇండస్ట్రీని ఏలినటువంటి రమ్యకృష్ణ ఇప్పటికీ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా పలు తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రమ్యకృష్ణ తాజాగా తమన్నా నటించిన జైలర్ సినిమాలోని నువ్వు కావాలయ్యా అనే పాటకు అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు.

రజనీకాంత్ తమన్నా ప్రధాన పాత్రలలో నెల్సన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం జైలర్. ఈ సినిమా ఆగస్టు 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇప్పటికే ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. అదే విధంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ నువ్వు కావాలయ్యా అంటూ సాగే పాటను కూడా విడుదల చేశారు.

ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తమన్న ఎక్కడికి వెళ్లిన ఈ పాటకు స్టెప్పులు వేస్తూ అందరిని సందడి చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నటి రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే రమ్యకృష్ణ తాజాగా తన వ్యానిటీ వ్యాన్ లో తన సిబ్బందితో కలిసి నువ్వు కావాలయ్యా అనే పాటకు డాన్స్ ఇరగదీసారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో 5పదుల వయసులో ఈ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఏంటి మేడం అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus