సీమంతం ఫోటోలను పోస్ట్ చేసి ఎమోషనల్ కామెంట్స్ చేసింది..!

లాక్ డౌన్ మొదలైనప్పటి నుండీ షూటింగులు లేక ఇంట్లోనే ఖాళీగా ఉంటున్న సినిమా సెలబ్రిటీలు.. తమ గతాన్ని తవ్వుకుంటున్నారు. వారి చిన్న నాటి ఫోటోలను, పెళ్లి ఫోటోలను… లేదా వారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఉన్న లుక్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా షేర్ చేస్తూ వస్తున్నారు. వాటిని అభిమానులు వైరల్ చెయ్యడమే పనిగా పెట్టుకున్నారు. గత కొద్ది రోజులుగా సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా తన సోషల్ మీడియాలో.. ఆమె పాత ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.

మొన్నటికి మొన్న ఆమె చిన్ననాటి ఫోటోని షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడు కళ్ళజోడు పెట్టుకుని ఉన్న ఫోటోని షేర్ చేసింది. తాజాగా ఆమె సీమంతం ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. ‘ఇద్దరు పెద్దమ్మలు నన్ను ఆశీర్వదించిన వేళ. నాకు అది మంచి జ్ఞాపకం. కానీ వాళ్ళు ఇప్పుడు లేరు’ అంటూ రమ్యకృష్ణ ముందుగా ఫోటోని షేర్ చేసింది. ఆ తరువాత మరో ఫొటోని కూడా పోస్ట్ చేసి.. ‘నా సీమంతాన్ని మా అమ్మే దగ్గరుండి జరిపించింది.

నా వెనుక నిలబడింది ఆమెనే’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ ఫొటోలో రమ్యకృష్ణ తల్లి కెమెరా పట్టుకుని ఉండడాన్ని మనం గమనించవచ్చు. రమ్యకృష్ణ 2003లో అప్పటి స్టార్ డైరెక్టర్ అయిన కృష్ణవంశీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి కొడుకు కూడా ఉన్నాడు.ప్రస్తుతం రమ్యకృష్ణ తన భర్త డైరెక్ట్ చేస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రంతో పాటు విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమాలో కూడా నటిస్తుంది.

1

2

3

4


Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus