దగ్గుబాటి రానా, చెన్నై సుందరి త్రిష చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అయితే వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారని అప్పట్లో మీడియాలో వార్తలు వస్తే.. “అబ్బే అదేం లేదు.. మేమిద్దరం స్నేహితులం” అని ఇద్దరు స్టేట్ మెంట్స్ ఇచ్చారు. ఓ ఫోటో వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని బయట పెట్టింది. రానా బుగ్గ మీద గట్టిగా ముద్దు పెడుతున్న త్రిష ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తన వ్యాఖ్యలతో సంచలనం సృష్టించిన సింగర్ సుచిత్ర ధనుష్, త్రిష, అనిరుధ్, ఆండ్రియా, హన్సికల సీక్రెట్ ఫోటోలను లీక్ చేసి వివాదానికి తెరతీసింది. ఇందులో భాగంగానే త్రిష ముద్దు పెడుతున్న ఫోటో అందరి అరచేతుల్లోకి వచ్చింది.
ఈ ఫోటో చూసిన వారందరూ రానా, త్రిషల మధ్య కచ్చితంగా ఏదో నడుస్తోందనే అంటున్నారు. త్రిష మొత్తానికి రానాని భలే ఇరికించేసిందని టాలీవుడ్ వర్గాలవారు చెప్పుకుంటున్నారు. ఇప్పటివరకు మీడియా నుంచి తప్పించుకున్న రానా ఈ ఫోటో పై ఏమని సమాధానం చెబుతారో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
