Hiranyakashyapa: త్రివిక్రమ్ పేరు అనౌన్స్ చేసి గుణశేఖర్ కి రానా షాకిచ్చినట్టేనా..!

టాలీవుడ్ చరిత్రలో గొప్ప రైటర్స్ లిస్ట్ తీస్తే అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు తప్పకుండా ఉంటుంది. ఎటువంటి కథనైనా తన స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేయగలరు త్రివిక్రమ్. ముఖ్యంగా డైలాగ్ రైటింగ్ లో త్రివిక్రమ్ చాలా మార్పులు తీసుకొచ్చారు. అతని డైలాగ్స్ లో ప్రాసలు, పంచులతో పాటు కామెడీ, ఎమోషన్ ను కూడా చక్కగా పండించగలరు. సరిగ్గా గమనిస్తే ఓ మెసేజ్ కూడా ఉంటుంది. దర్శకుడిగా త్రివిక్రమ్ టాప్ ప్లేస్ కి చేరుకోవడానికి అతని రైటింగ్ కారణం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

త్రివిక్రమ్ డైరెక్టర్ గా మారిన తర్వాత కూడా రైటర్ గా కొన్ని సినిమాలకు పనిచేశారు. ‘జై చిరంజీవ’ ‘తీన్ మార్’ ‘ఛల్ మోహన్ రంగ’ ‘భీమ్లా నాయక్’ ఇప్పుడు ‘బ్రో’ వంటి సినిమాలకి రైటర్ గా పనిచేశారు. చిరు, పవన్ కళ్యాణ్ ల పై ఉన్న అభిమానంతో మాత్రమే త్రివిక్రమ్ ఈ సినిమాలకి పని చేయడం జరిగింది. అయితే త్వరలో త్రివిక్రమ్ రానా సినిమాకి కూడా పనిచేయబోతున్నట్టు ఇన్సైడ్ టాక్.

రానా ‘స్పిరిట్ మీడియా’ అనే తన ప్రొడక్షన్ కంపెనీ పై నిర్మిస్తున్న వివిధ చిత్రాల వివరాలు రానా అమెరికాలో ‘కామిక్ కాన్’ ఈవెంట్ లో తెలియజేసాడు. ఈ క్రమంలో ‘హిరణ్యకశ్యప’ చిత్రానికి త్రివిక్రమ్ రైటర్ అని ప్రకటించాడు రానా. వాస్తవానికి (Hiranyakashyapa) ‘హిరణ్యకశ్యప’ చిత్రాన్ని గుణశేఖర్ డైరెక్షన్లో చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ గుణశేఖర్ ఇప్పుడు ఫామ్లో లేరు. అయినప్పటికీ మాటలు, స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ తో డిజైన్ చేయించుకుని డైరెక్షన్ గుణశేఖర్ తో చేయించాలి అనేది రానా ఆలోచన కావచ్చు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus