వెంకటేష్ – రానా… మల్టీ స్టారర్ ఫిక్స్…!

  • November 9, 2020 / 05:33 PM IST

వెంకటేష్ తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి రెండు సినిమాల్లో నటించాడు. ఒకటి ‘ప్రేమమ్'(గెస్ట్ రోల్) కాగా మరొకటి ‘వెంకీమామ’. ఈ రెండు చిత్రాలు కూడా మంచి విజయాలనే సొంతం చేసుకున్నాయి. వీటితో అక్కినేని, దగ్గుబాటి.. అభిమానుల కోరిక తీరింది. అయితే వెంకటేష్ తన అన్నయ్య కొడుకు రానాతో కలిసి ఎప్పుడు సినిమా చేస్తాడు? అనే ప్రశ్న ఇంకా అందరిలోనూ ఉంది. ఈ ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు మొదలవుతుందా.. అని వీరిద్దరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ విషయం పై తాజాగా రానా క్లారిటీ ఇచ్చేసాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా మాట్లాడుతూ.. ‘చిన్నాన్న నేను కలిసి త్వరలోనే సినిమా చేయబోతున్నాం.ఎప్పటి నుండో మేమిద్దరం కలిసి సినిమా చెయ్యాలని.. మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేసాము. అది ఈ లాక్‌డౌన్‌ టైములో దొరికింది.మా ఇద్దరికీ ఆ స్క్రిప్ట్ బాగా నచ్చింది’ అంటూ రానా చెప్పుకొచ్చాడు. కానీ ఈ ప్రాజెక్ట్ ఎవరు డైరెక్ట్ చేస్తారు.. ఎవరు నిర్మిస్తారు వంటి విషయాలను అయితే రానా బయటపెట్టలేదు.

అయితే.. రానా తండ్రి సురేష్‌ బాబు ఈ ప్రాజెక్టుని నిర్మించే అవకాశాలు ఉన్నట్టు ఇన్సైడ్ టాక్. గతంలో వచ్చిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాలో ‘బళ్లారి బావ’ పాటకు వీరిద్దరూ కలిసి స్టెప్పులేసిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus