Rana: ‘మాలిక్’ సినిమాపై రానా కన్ను!

  • August 2, 2021 / 03:19 PM IST

మలయాళంలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు ఫహద్ ఫాజిల్. ఓటీటీల హవా పెరిగిన తరువాత తెలుగు ప్రేక్షకులు కూడా ఆయన సినిమాలను బాగా చూస్తున్నారు. ఆయన నటన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందుకే ‘పుష్ప’ లాంటి సినిమాలో ఆయన్ను విలన్ గా తీసుకున్నారు. ఫహద్ నటిస్తున్నాడని తెలియగానే ‘పుష్ప’ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. రీసెంట్ గా ఈ హీరో నటించిన ‘మాలిక్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లు మూతపడడంతో అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను విడుదల చేశారు.

మత ఘర్షణలు, రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఫహద్ పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇటీవల ఈ సినిమా చూసిన రానా తెలుగులో ఈ సినిమా చేస్తే బాగుంటుందని అనుకున్నారట. దీంతో ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారట. నిజానికి ఈ స్టోరీ రానాకి సూట్ అవుతుంది.

అందుకే ఆయన కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మొదట అయితే రీమేక్ హక్కులు కొనేయాలని రానా ఫిక్స్ అయ్యారట. ఆ తరువాత తను నటించాలా..? వేరే వాళ్లతో సినిమా చేయాలా..? అనేది నిర్ణయించుకుంటారు. ఇప్పటికే రానా మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇప్పుడు మరో రీమేక్ పై అతడి దృష్టి పడింది.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus