అప్పటికే రానా.. అంత కథ నడిపాడా..?

దగ్గుబాటి రానా మొత్తానికి ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. గతంలో అసలు పెళ్ళంటేనే ఇష్టం లేదన్నట్టు ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చిన రానా.. ఇలా పెళ్ళి పీటలెక్కడానికి రెడీ అవుతాడని ఎవ్వరూ ఊహించలేదు. చెప్పాలంటే పెద్ద షాక్ ఇచ్చాడనే చెప్పాలి. మెహీక బజాజ్ తో మొన్నటికి మొన్న రోకా ఫంక్షన్ కూడా చేసుకున్న రానా… తాజాగా ఇన్స్టా లో లక్ష్మీ మంచు నిర్వహించిన `లాక్డ్ అప్ విత్ లక్ష్మి` లైవ్ షోలో.. రానా తన లవ్ స్టోరీ చెప్పుకొచ్చాడు.

మిహీక.. రానాకు చాలా కాలంగా తెలుసట. తన సోదరి దగ్గుబాటి ఆశ్రిత.. అదేనండీ మన వెంకటేష్ కూతురుకి క్లాస్ మేట్ అట.ఆమె ద్వారానే రానాకు మిహీకాతో పరిచయం ఏర్పడిందట.అది కాస్త స్నేహంగా మారిందట. ఆమెతో చాలా కాలం స్నేహం తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని లవ్ లో పడ్డారని రానా తెలిపాడు. రానా ప్రపోజ్ చేసిన తీరు కూడా సినిమాటిక్ గా ఉంది. ముందుగా మిహీకా కు ఈ రానా తన ప్రేమ గురించి చెప్పలేదట.

మొదట ఆమె తల్లిదండ్రులకు చెప్పాడట. ఆ తరువాత మిహీకా కు చెప్పి.. ఆమెను కన్విన్స్ చేసాడట. అలా చివరికి ఆమె ఎస్ అనడం.. వెంటనే సోషల్ మీడియాలో రానా ప్రకటించడం జరిగిపోయింది. ఇక రానా పెళ్ళి…. డిసెంబర్ లోపు ఉంటుందని సురేష్ బాబు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక రానా, మిహీక ల ఫోటోలు మాత్రం ఇప్పటికీ వైరల్ అవుతుండడం విశేషం.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus