Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

  • October 16, 2026 / 01:40 PM ISTByFilmy Focus Desk
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Hero)
  • ర‌ష్మిక మంద‌న్న‌ (Heroine)
  • ఈశ్వ‌రీరావు, ఆర్నాల్డ్ వోస్తో, మైమ్ మ‌ధు, కంచెర‌పాలెం కిషోర్ త‌దిత‌రులు (Cast)
  • రాహుల్ సాంకృత్యాన్‌ (Director)
  • న‌వీన్ యెర్నేని, ర‌వి శంక‌ర్ య‌ల‌మంచిలి (Producer)
  • అజ‌య్ - అతుల్‌ (Music)
  • నీరవ్ షా, జిష్ణు భట్టాచార్జీ (Cinematography)
  • కార్తీక శ్రీనివాస్ ఆర్ (Editor)
  • Release Date : 16 అక్టోబ‌ర్‌ 2026
  • మైత్రీ మూవీ మేక‌ర్స్‌ (Banner)

పెళ్లి త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మొద‌టి మూవీ “ర‌ణ‌బాలి” . హిస్టారిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించింది. విజ‌య్‌, ర‌ష్మిక జోడీకి ఉన్న క్రేజ్ కార‌ణంగా ఆరంభం నుంచే అభిమానుల్లో ర‌ణ‌బాలి ఆస‌క్తిని రేకెత్తిస్తూ వ‌చ్చింది. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ సినిమా ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు ఉందా? టాక్సీవాలా త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు రాహుల్ సాంకృత్యాన్ మ‌రో హిట్టు ఇచ్చాడా? విజ‌య్‌, ర‌ష్మిక జోడీ తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించారా? లేదా? అంటే?

Ranabaali Movie

క‌థ‌: రాయ‌ల‌సీమ‌లోని శింగ‌న‌మ‌ల ఊరికి సంర‌క్ష‌కుడిగా ఉంటాడు ర‌ణ‌బాలి (విజ‌య్ దేవ‌ర‌కొండ‌). జాలి, ద‌య లాంటి గుణాలు లేకుండా త‌ల్లి అత‌డిని పెంచుతుంది. ర‌ణ‌బాలికి జ‌య‌మ్మ‌తో (ర‌ష్మిక మంద‌న్న‌) పెళ్ల‌వుతుంది. మొర‌టుగా పెరిగిన ర‌ణ‌బాలిలో జ‌య‌మ్మ కార‌ణంగా మార్పువ‌స్తుంది. అదే స‌మ‌యంలో మ‌ద్రాస్ ప్రెసిడెన్సీకి స‌ర్‌ థియేడ‌ర్ హెక్ట‌ర్ ( ఆర్నాల్డ్ వోస్లో) క‌మీష‌న‌ర్‌గా వ‌స్తాడు. రాయ‌ల‌సీమ ప్రాంతంలో పండిన పంట‌ల‌ను ప‌న్నుల పేరుతో దోచుకోవ‌డం మొద‌లుపెడ‌తాడు. ఎదురుతిరిగిన వారిని దార‌ణంగా హింసించి చంపేస్తుంటాడు. హెక్ట‌ర్ అన్యాయాల చూసి ర‌ణ‌బాలి చ‌లించిపోతాడు. క‌రువుతో అల్లాడుతున్న ప్ర‌జ‌ల‌కు సాయం చేయ‌ల‌ని హెక్ట‌ర్‌పై తిరుగుబాటు మొద‌లుపెడ‌తాడు. ఈ పోరాటంలో ర‌ణ‌బాలికి ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయి? భ‌ర్త కోసం జ‌య‌మ్మ ఎలాంటి త్యాగానికి సిద్ధ‌ప‌డింది? హెక్ట‌ర్ దోచుకున్న ధాన్యాన్ని, పంట‌ల‌ను ర‌ణ‌బాలి ఎలా తిరిగి సొంతం చేసుకున్నాడు? ర‌ణ‌బాలిని నేరుగా ఎదుర్కోలేక హెక్ట‌ర్ ఎలా దొంగ‌దెబ్బ తీశాడు? ర‌ణ‌బాలిని చంపాల‌నే అత‌డి ల‌క్ష్యం తీరిందా? అన్న‌దే “ర‌ణ‌బాలి” మూవీ క‌థ‌.

న‌టీన‌టుల ప‌నితీరు: ర‌ణ‌బాలి పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఒదిగిపోయాడు. బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీ మార్చుకొని న‌టించాడు. పాత్ర తాలూకు ఆర్క్ ఎక్క‌డ డీవీయేట్ కాకుండా జాగ్ర‌త్త‌ప‌డ్డాడు. ర‌ష్మిక చేసిన జ‌య‌మ్మ పాత్ర ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింది. అల్ల‌రిత‌నం క‌న‌బ‌డ‌కుండా సెటిల్డ్ యాక్టింగ్‌తో మెప్పించింది. ఎమోష‌న‌ల్ సీన్ల‌లో ఆక‌ట్ట‌కుంటుంది. ఎంద‌య్యా సామీ పాట‌లో విజ‌య్, ర‌ష్మిక కెమిస్ట్రీ బాగుంది.

ఆర్గాల్డ్ వోస్లో విల‌నిజం అనుకున్న స్థాయిలో ఎలివేట్ కాలేదు. హీరోకు ధీటుగా అత‌డిన పాత్ర‌ను ప్ర‌జెంట్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డిపోయాడు. త‌ల్లి పాత్ర‌లో ఈశ్వ‌రీరావుకు ఇలాంటి క్యారెక్ట‌ర్లు చేయ‌డం కొత్తేమీ కాదు. మైమ్ మ‌ధు, కంచెర‌పాలెం కిషోర్‌, మ‌ధునంద‌న్‌, వినోద్ సాగ‌ర్‌ల‌కు మంచి పాత్ర‌లే ద‌క్కాయి.

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు : బ్రిటీష‌ర్ల కాలంలో ఎదురైన క‌రువు ప‌రిస్థితుల కార‌ణంగా ల‌క్ష‌లాది ఆక‌లి చావులు సంభ‌వించాయి. శిస్తుల పేరుతో ప్ర‌జ‌ల‌ను దోచుకొని…వారికి ఆహారం లేకుండా చేసి త‌మ బానిస‌లుగా మార్చుకోవాల‌ని ఆంగ్లేయులు వేసిన ఎత్తుల‌ను ఎదురించిన ఓ యోధుడి క‌థ‌తో ద‌ర్శ‌కుడు రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాను తెర‌కెక్కించారు.

య‌థార్థంగా జ‌రిగిన సంఘ‌ట‌న‌ల నుంచి స్ఫూర్తి పొంది ఫిక్ష‌న‌ల్‌గా ఈ క‌థ‌ను రాసుకున్నారు. ద‌ర్శ‌కుడు ఎంచుకున్న పాయింట్ మంచిదే. కానీ ఎమోష‌న‌ల్‌గా చెప్ప‌డంలో త‌డ‌బ‌డిపోయాడు. ఇలాంటి సినిమాల్లో క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ విష‌యంలో ఏ మాత్రం హ‌ద్దుదాటినా విమ‌ర్శ‌లు వ‌స్తాయి. ఆ లిమిట్స్ దృష్టిలో పెట్టుకొని తాను రాసుకున్న క‌థ‌ను నిజాయితీగా స్క్రీన్‌పై ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు.

అజ‌య్ అతుల్ పాట‌ల్లో ఏంద‌య్యా సామీ ఒక్క‌టే బాగుంది. మిగిలిన వాటిలో ఏది వినాల‌నిపించేలా లేదు. బీజీఎమ్ క‌థ‌కు సింక్ కాలేదు. నీరవ్ షా, జిష్ణు భట్టాజిష్ణు భట్టాచర్జీ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. రాయ‌ల‌సీమ నేటివిటీని, బ్రిటీష‌ర్ల కాలం నాటి వాతావ‌ర‌ణాన్ని త‌మ కెమెరాతో రీక్రియేట్ చేశారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీగానే ఖ‌ర్చు చేసి ఈ సినిమాను రూపొందించారు. ర‌న్‌టైమ్ ఎక్కువే అనిపిస్తుంది. రెండు గంట‌ల యాభై నిమిషాలు కాకుండా మ‌రో ఇర‌వై, ముప్పై నిమిషాలు త‌గ్గిస్తే బాగుండు.

విశ్లేష‌ణ: దేశ‌భ‌క్తి అనే ఎమోష‌న్‌కు భాషాభేదాల‌తో సంబంధం ఉండ‌దు. ఈ క‌థ‌ల‌ను ఎంతో హానెస్ట్‌గా స్క్రీన్‌పై చెప్ప‌గ‌ల‌గాలి. డ్రామాను బాగా పండించాలి. అప్పుడే ఈ క‌థ‌లు ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అవుతాయి. అదే స్థాయిలో ఆ జాన‌ర్‌లో రిస్క్ కూడా ఉంటుంది. క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ రేటు త‌క్కువే. జెన్‌జీ ఆడియెన్స్‌కు బ్రిటీష‌ర్ల దోపిడీ, స్వాతంత్య్ర కోసం పోరాడిన వీరులు గురించి క‌న్వీన్సింగ్‌గా చెప్ప‌డం అంటే క‌త్తి మీద సామే. ర‌ణ‌బాలితో ఈ రిస్క్‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాహుల్ సాంకృత్యాన్ సిద్ధ‌ప‌డ్డారు. ఆడియెన్స్‌కు జెన్యూన్ సినిమాను అందించాల‌నే ప్ర‌య‌త్నంలో కొంత వ‌ర‌కు స‌క్సెస్ అయ్యారు.

ర‌ణ‌బాలి లాంటి క‌థ‌ల‌తో గ‌తంలో తెలుగులో సైరా న‌ర‌సింహారెడ్డితో పాటు చాలా సినిమాలు వ‌చ్చాయి. వాటికి ఛాయ‌ల‌తోనే ఈ సినిమా సాగుతుంది. మైథాల‌జీ ట్రెండ్ న‌డుస్తుండ‌టంతో ఆ ఎమోష‌న్‌కు కూడా సినిమాకు మిక్స్ చేశారు డైరెక్ట‌ర్‌. ప్ర‌జ‌ల‌కు సాయం చేయ‌డానికి దేవుడు ఏ రూపంలోనైనా రావ‌చ్చునంటూ ఓ మెసేజ్ ఇచ్చారు.

ర‌ణ‌బాలి క‌థ‌ను బిల్డ్ చేయ‌డానికే ఫ‌స్ట్ హాఫ్ మొత్తం తీసుకున్నాడు డైరెక్ట‌ర్‌. దాంతో క‌థ చాలా నెమ్మ‌దిగా సాగుతున్న అనుభూతి క‌లుగుతుంది. బ్రిటీష‌ర్ల ఎత్తుల‌ను ర‌ణ‌బాలి తిప్పికొట్టే సీన్లు సాదాసీదాగా సాగుతాయి. గుహ‌లో యాక్ష‌న్ ఎపిసోడ్ లాంటివి ఇంకొన్ని రాసుకుంటే బాగుండేది. క్లైమాక్స్ ఫైట్ కూడా యావ‌రేజ్‌గానే ఉంది.

క‌థ‌లోని లోపాల‌ను విజ‌య్‌, ర‌ష్మిక త‌మ యాక్టింగ్‌తో చాలా వ‌ర‌కు క‌వ‌ర్ చేశారు. విజ‌య్‌కి యూత్‌లో ఉన్న ఇమేజ్‌ను వాడుకోవాల‌ని కాకుండా త‌ను అనుకున్న క‌థ‌కు క‌ట్టుబ‌డే ద‌ర్శ‌కుడు సినిమా చేసిన తీరు బాగుంది.

ఫోక‌స్ పాయింట్‌: “ర‌ణ‌బాలి” హానెస్ట్ అటెంప్ట్‌. విజ‌య్, ర‌ష్మిక యాక్టింగ్ కోసం ఓ సారి చూడొచ్చు.

రేటింగ్‌: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rahul Sankrithyan
  • #Ranabaali
  • #Ranabaali Review
  • #Rashmika Mandanna
  • #Vijay Deverakonda

Reviews

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

23 mins ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

53 mins ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

20 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

23 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version