యూత్ స్టార్ నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘రంగ్ దే’. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ కావడం మరో విశేషం. మార్చి 26న విడుదలైన ఈ చిత్రానికి మొదటి షో నుండే పాజిటివ్ టాక్ లభించడంతో మంచి ఓపెనింగ్స్ నే సాధించింది.అయితే వీక్ డేస్ లో మాత్రం ఈ చిత్రం తడబడింది.ఇక ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.
ఇక ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
5.80 cr
సీడెడ్
2.15 cr
ఉత్తరాంధ్ర
1.78 cr
ఈస్ట్
1.08 cr
వెస్ట్
0.65 cr
గుంటూరు
1.18 cr
కృష్ణా
0.74 cr
నెల్లూరు
0.52 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
13.90 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.78 cr
ఓవర్సీస్
1.83 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
16.51 cr
‘రంగ్ దే’ చిత్రానికి 23.9కోట్ల బిజినెస్ జరిగింది. అయితే కొన్ని ఏరియాల్లో నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకోవడం జరిగిందట.దాంతో ఈ చిత్రం 19కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ ను సాధించినట్టే..! కానీ ఫుల్ రన్లో ఈ చిత్రం 16.51 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. అంటే బయ్యర్లకు 2.49 కోట్ల నష్టాలు వాటిల్లాయి. దాంతో ఈ చిత్రాన్ని యావరేజ్ గా పరిగణించాలి.