Rowdy Janardhana: విజయ్ దేవరకొండ మళ్లీ రెండు ముక్కల ఆట ఆడుతున్నాడా? రిస్క్ అవుతుందేమో
- November 1, 2026 / 04:47 PM ISTByFilmy Focus Desk
విజయ్ దేవరకొండ గురించి మొన్నీ మధ్య వరకు మాట్లాడుకునేటప్పుడు సరైన విజయం వచ్చి చాలా ఏళ్లు అయింది అని అనుకున్నాం. ఇప్పుడు ‘రణబాలి’ రిలీజ్ అయిన తర్వాత విజయ్ ఎందుకిలా రిస్క్ చేశాడు అని అనుకున్నారు కొందరు. అయితే నిర్మాతలు లాభాలు వచ్చాయి అని చెప్పారు కాబట్టి విజయం అందుకున్నారు అనుకోవచ్చు. రెండింటిలో ఏది ఫైనల్ అనేది త్వరలో తేలుతుంది. ఇక లేటెస్ట్ పాయింట్‌కి వస్తే.. విజయ్ కొత్త సినిమాను రెండు ముక్కలు చేస్తున్నారట.
Rowdy Janardhana
‘రణబాలి’ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు అయిపోయింది అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దీంతో విజయ్ తన తర్వాతి సినిమా మీద దృష్టి పెడుతున్నాడు. అదే ‘రౌడీ జనార్ధన’. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ మొదలుపెట్టేశాడు. తొలుత అనుకున్నదాని ప్రకారం అయితే ‘రణబాలి’, ‘రౌడీ జనార్ధన’ సినిమాలు ఏక కాలంలో షూటింగ్ చేసి దగ్గర దగ్గరలో రిలీజ్ చేసేద్దాం అనుకున్నారు. కానీ వివిధ కారణాల వల్ల అవ్వలేదు.
ఇక ‘రణబాలి’ సినిమా విజయం విజయ్ కెరీర్‌కి ఎంత బూస్ట్ ఇస్తుందో తెలియదు కానీ.. ఇప్పుడు తర్వాతి సినిమా విషయంలో కొత్త కబురు వచ్చి.. మరోసారి ‘విజయ్ ఏమన్నా రిస్క్ చేస్తున్నాడా’ అని మరోసారి అనుకునేలా చేస్తోంది. ఎందుకంటే ‘రౌడీ జనార్ధన’ సినిమాను టూ పార్ట్స్ చేసి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారట. సినిమా కథ దృష్ట్యా రెండు పార్టులు అయితే బాగుండు అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
అయితే, రీసెంట్ టైమ్స్‌లో ఇలా రెండు ముక్కలు చేస్తున్న సినిమాల తొలి భాగం వచ్చాక ఆ ఫలితం చూసి రెండో పార్టు గురించి ఆలోచిస్తున్నారు. అలాంటి సినిమాల్లో ‘కింగ్డమ్’, ‘దేవర’ లాంటివి చాలానే ఉన్నాయి. మరిప్పుడు ‘రౌడీ జనార్ధన’ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. పైన చెప్పినట్లు డిసెంబరు 25న సినిమా రిలీజ్ అవ్వాలి. మరిప్పుడు అనుకున్న టైమ్‌కి సినిమా వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి కొత్త డేట్ ఎప్పుడు చెబుతారా అనేది ఆసక్తికరంగా మారింది.















