Naga Chaitanya, Sai Pallavi: అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన లవ్ స్టోరీ!

ఈ మధ్య కాలంలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో లవ్ స్టోరీ కూడా ఒకటి. చైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లపరంగా రికార్డులు క్రియేట్ చేసింది. అమెరికాలో సైతం ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సాధించడం గమనార్హం. అయితే లవ్ స్టోరీ సినిమా గురించి ఏఎంబీ సినిమాస్ సోషల్ మీడియా ద్వారా కీలక ప్రకటన చేసింది.

ఏఎంబీ సినిమాస్ లో 251 షోలను ప్రదర్శించగా 48,233 మంది సినిమాను చూశారని సినిమాకు కోటి రూపాయల కలెక్షన్లు వచ్చాయని ప్రకటన వెలువడింది. ట్విట్టర్ ద్వారా ఏఎంబీ సినిమాస్ లవ్ స్టోరీ భారీ సక్సెస్ సాధించడం గురించి సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు కంగ్రాట్స్ తెలిపింది. లవ్ స్టోరీ అరుదైన రికార్డును సొంతం చేసుకోవడంతో చైతన్య, సాయిపల్లవి ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. సినిమాసినిమాకు మార్కెట్ ను పెంచుకుంటున్న నాగచైతన్య లవ్ స్టోరీ సినిమాతో 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తారని ఫ్యాన్స్ భావించగా 50 శాతం ఆక్యుపెన్సీ,

ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు వల్ల ఈ సినిమా ఆ రికార్డును సొంతం చేసుకోలేకపోయింది. నాగచైతన్య నటిస్తున్న సినిమాలు వరుసగా సక్సెస్ సాధిస్తుండటంతో థాంక్యూ సినిమాపై కూడా భారీగా అంచనాలు ఏర్పడటం గమనార్హం. థాంక్యూ సినిమాకు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చైతన్యకు జోడీగా ఈ మూవీలో రాశీఖన్నా నటిస్తున్నారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus