Dil Raju: దిల్ రాజు అట్టర్ ప్లాప్ అవుతాడు.. సి.కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

‘దిల్ రాజు(Dil Raju) అట్టర్ ప్లాప్ అవుతాడు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు నిర్మాత సి.కళ్యాణ్. వివరాల్లోకి వెళితే.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టిఎఫ్ సి సి) లో నెలకొన్న రాజకీయాల నేపథ్యంలో నిర్మాత సి. కళ్యాణ్, దిల్ రాజుపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు అర్ధం చేసుకోవచ్చు.2023లో జరిగిన ఛాంబర్ ఎన్నికల్లో భాగంగా దిల్ రాజు ప్యానెల్ చేతిలో సి. కళ్యాణ్ ప్యానెల్ దారుణ పరాజయం పాలైంది.

Dil Raju

అప్పటి నుండి ఛాన్స్ దొరికిన ప్రతిసారి దిల్ రాజు పనితీరుపై కళ్యాణ్ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాడు.’దిల్ రాజు తీసుకుంటున్న నిర్ణయాలు కేవలం పెద్ద నిర్మాతలకు (అందులోనూ గిల్డ్ సభ్యులకు) మాత్రమే అనుకూలంగా ఉంటున్నాయని, చిన్న నిర్మాతలను మాత్రం అతను గాలికి వదిలేస్తున్నాడని’ సి.కళ్యాణ్ విమర్శిస్తూ వచ్చారు. ‘యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’ అనే సమాంతర వ్యవస్థను దిల్ రాజు నడుపుతూ, ఛాంబర్ క్రెడిబిలిటీని తగ్గిస్తున్నారని కూడా సి. కళ్యాణ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

దిల్ రాజు తన పంపిణీ వ్యవస్థ ద్వారా థియేటర్లను తన కంట్రోల్‌లో పెట్టుకుని చిన్న సినిమాలకు అన్యాయం చేస్తున్నారని కూడా కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

ఇక తాజాగా సి.కళ్యాణ్.. “ఎఫ్.డి.సి ఛైర్మెన్ గా ఉండి ఛాంబర్ ఎన్నికల్లో పోటీ చేయకూడదు అనే కామన్ సెన్స్ కూడా దిల్ రాజుకి లేదు. కేవలం అతని అహం కొద్దీ ఎన్నికల బరిలో నిలబడి మిగిలిన వారిని ఇబ్బంది పెట్టాలనేది అతని ఉద్దేశం. నేను కచ్చితంగా చెబుతున్నాను ‘హీ ఈజ్ గోయింగ్ టు బి అట్టర్ ప్లాప్’.. ఈ నెల 28 వ తారీఖు సాయంత్రానికి తేలిపోతుంది” అంటూ దిల్ రాజుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

క్రిస్మస్ హాలిడే రోజున కొన్ని మెరుపులు మెరిపించిన ‘అఖండ 2’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus