శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు వంటి నటీనటులు కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘దండోరా'(Dhandoraa). మురళీకాంత్ దర్శకత్వం వహించిన సినిమా ఇది.’కలర్ ఫోటో’ తో నేషనల్ అవార్డ్ గెలుచుకున్న ‘లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్’ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మించారు. మధ్యలో వీళ్ళు నిర్మించిన ‘బెదురులంక 2012’ కూడా కమర్షియల్ సక్సెస్ అందుకుంది.
ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందిన ‘దండోరా’ టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మొదటి రోజు ఈ సినిమాకి కొంత మేర మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.
దీంతో ఓపెనింగ్స్ కూడా సాధా సీదాగా నమోదయ్యాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 0.10 cr |
| సీడెడ్ | 0.04 cr |
| ఆంధ్ర(టోటల్) | 0.08 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.22 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.03 cr |
| ఓవర్సీస్ | 0.04 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 0.29 కోట్లు(షేర్) |
‘దండోరా'(Dhandoraa) సినిమాకి రూ.1.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.1.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.క్రిస్మస్ హాలిడేని ఈ సినిమా ఓ మోస్తరుగా క్యాష్ చేసుకుంది. మొదటి రోజు రూ.0.29 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.1.51 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.