Mahesh Babu: స్టార్ హీరో మహేష్ ఖాతాలో సూపర్ రికార్డ్.. ఏమైందంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబుకు  (Mahesh Babu) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేననే సంగతి తెలిసిందే. మహేష్ బాబు తన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని పేదల కోసం ఖర్చు చేస్తున్నారు. సేవా కార్యక్రమాలు చేసే విషయంలో మహేష్ బాబుకు ఎవరూ సాటిరారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గత కొన్నేళ్లుగా మహేష్ బాబు నటించిన సినిమాలన్నీ సక్సెస్ సాధించాయి. అయితే మహేష్ బాబు గత ఐదు సినిమాలు 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి.

Mahesh Babu

ప్రస్తుతం పెద్ద సినిమాలు విడుదలైన కొన్ని వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో వరుసగా 5 సినిమాలు 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం సులువైన విషయం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ బాబు మాత్రమే ఇలాంటి రికార్డులను ఖాతాలో వేసుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సాధించిన ఈ రికార్డును బ్రేక్ చేయడం కొంతమంది హీరోలకు ఇప్పట్లో సాధ్యం కాదని చెప్పవచ్చు.

ప్రభాస్ (Prabhas)  , మహేష్ సినిమాలు ఏరియాలతో సంబంధం లేకుండా కలెక్షన్ల విషయంలో అదరగొడుతున్నాయని చెప్పాలి. మహేష్ సినిమాలు ఓవర్సీస్ లో సైతం ఎన్నో అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకున్నాయనే సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి (S. S. Rajamouli)  సినిమా కోసం మేకోవర్ అవుతున్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ ఎలా ఉండబోతుందనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ పాన్ వరల్డ్ మూవీ కాగా ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ కావడానికి మరో మూడేళ్ల సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంది.

‘సత్యం సుందరం’ 2 వారాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus