Ravi Teja: ఈ జనరేషన్ లో రవితేజకు సొంతమైన రికార్డ్ ఏంటో మీకు తెలుసా?

మాస్ మహారాజ్ రవితేజకు (Ravi Teja) ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేకపోయినా కెరీర్ ను మాత్రం అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) సినిమా ఆగష్టు నెల 15వ తేదీన థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం బ్యాలెన్స్ ఉందని భోగట్టా. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. అగ్రిమెంట్ మాత్రం పూర్తి కావాల్సి ఉందని తెలుస్తోంది.

అయితే ఇప్పటికీ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్న హీరోలలో గడిచిన రెండు దశాబ్దాల్లో ఎక్కువ సంఖ్యలో పోలీస్ పాత్రల్లో నటించడంతో పాటు ఎక్కువ విజయాలను ఖాతాలో వేసుకున్న రవితేజ మాత్రమేనని సమాచారం. విక్రమార్కుడు (Vikramarkudu), పవర్ (Power) , వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) , మిరపకాయ్ (Mirapakay) వెంకీ, టచ్ చేసి చూడు మరికొన్ని సినిమాలలో రవితేజ పోలీస్ రోల్ లో కనిపించారు. కిక్ (Kick) సినిమాలో రవితేజ కొన్ని సెకన్ల పాటు పోలీస్ రోల్ లో కనిపించినా తన నటనతో మెప్పించిన సంగతి తెలిసిందే.

పోలీస్ గెటప్ కు రవితేజ పర్ఫెక్ట్ గా సూట్ అవుతారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రవితేజ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా సత్తా చాటడంతో పాటు మరిన్ని సంచలన విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. రవితేజ పారితోషికం ప్రస్తుతం 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. మిస్టర్ బచ్చన్ సినిమాకు సంబంధించి 12 రోజుల షూట్ బ్యాలెన్స్ ఉందని భోగట్టా.

రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉండగా మిస్టర్ బచ్చన్ సక్సెస్ సాధిస్తే రవితేజ భవిష్యత్తు సినిమాలపై సైతం అంచనాలు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. రవితేజ వయస్సు పెరుగుతున్నా లుక్స్ విషయంలో కేర్ తీసుకుంటూ తన ఎనర్జీ లెవెల్స్ తో ఆశ్చర్యపరుస్తున్నారు. రవితేజను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus