Naga Shaurya: బడ్జెట్ సమస్యల వల్ల ఆగిపోయిన నాగ శౌర్య సినిమా?

నాగ‌శౌర్య (Naga Shaurya) ఈ మధ్య కాస్త స్లో అయ్యాడు. గతంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండే ఈ యంగ్ హీరో.. వరుస ప్లాపులు కారణంగా సినిమాలు తగ్గించాడు. గతేడాది `రంగ‌బ‌లి` తో (Rangabali) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఫస్టాఫ్ చూస్తే.. శౌర్య హిట్టు కొట్టేసాడు అనే ఫీలింగ్ ఇచ్చింది. కానీ సెకండాఫ్ గ్రాఫ్ ని అమాంతం పడేసింది. ఆ సినిమా తర్వాత శౌర్య నుండి ఇంకో సినిమా రాలేదు. ఓ సినిమా మొదలయ్యింది. కానీ మధ్యలోనే ఆగిపోయింది.

ద‌ర్శ‌కుడుకి, నిర్మాతకి మ‌ధ్య మనస్పర్థలు రావడం వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది.ఓ ఎన్.ఆర్‌.ఐ నిర్మాతగా మారి నాగ‌శౌర్య‌తో సినిమా మొదలుపెట్టాడు. అరుణాచ‌లం అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. హారీష్ జైరాజ్‌ ని (Harris Jayaraj) సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. 12 రోజులు షూటింగ్ కూడా జరిగింది. అయితే అడ్వాన్సుల‌తో కలిపి ఆ ప్రాజెక్టుకి దాదాపు రూ.12 కోట్లు బడ్జెట్ అయ్యిందట. ద‌ర్శ‌కుడికీ, నిర్మాత‌కూ మ‌ధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆ సినిమా ఆగిపోయింది.

ఇక ఈ ప్రాజెక్టు గురించి ఇప్పుడు ఫిలిం ఛాంబర్లో ఇష్యు కూడా జరుగుతుందట. కథా చర్చల కోసమే స్టార్ హోటల్స్ లో సిట్టింగ్లు వంటివి వేసి లక్షల్లో బిల్స్ చూపించారంటూ ఆ ఎన్నారై నిర్మాత ఆరోపించినట్లు తెలుస్తుంది. 12 రోజులు షూటింగ్ కంటే అదే ఎక్కువైందని తెలుస్తుంది. మరి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సెటిల్మెంట్లు సినీ పెద్దలు తెలుస్తారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus