ఓవర్ నైట్ స్టార్ అంటుంటారు కదా.. అలా ఓవర్ నైట్ నేషనల్ క్రష్ అయిపోయింది రష్మిక మందన. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా నాయిక అయినప్పటికీ అప్పటికే ఆమె సోషల్ మీడియాలో ఫేమస్. అయితే ఆమె సినిమాలు, సోషల్ మీడియా కంటే కాంట్రవర్శీలతో ఫేమస్. తెలిసి చేస్తుందో, తెలియక చేస్తుందో తెలియదు కానీ.. ఒక్క మాట అంటే రెండు కాంట్రవర్శీలు అవుతున్నాయి. ఈ క్రమంలో ఆమె జాగ్రత్తపడుతోంది కూడా. అయితే రష్మిక తన కుటుంబం గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
దక్షిణాదిలోను, ఉత్తరాదిలోనూ వరుస అవకాశాలతో జోరు మీదుంది రష్మిక మందన. నటిగా ఇప్పటివరకు ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని అవార్డులు దక్కించుకున్నా తన తల్లిదండ్రులు తన విషయంలో ఇంకా గర్వపడలేదని చెప్పింది రష్మిక మందన. నా విషయంలో నా తల్లిదండ్రులు ఇంకా గర్వపడలేదు అని షాకింగ్ కామెంట్స్ చేసింది. వారు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండటమే దీనికి కారణం అని చెప్పింది. అసలు నేనేం చేస్తున్నానో వారికి పూర్తిగా అర్థం కాలేదు అని చెప్పింది.
మా వాళ్లు నేను అవార్డులు గెలుచుకున్నప్పుడు చాలా ఆనందిస్తుంటారు. అయితే నేనేం చేస్తున్నాను అనే విషయంలో వారి పూర్తి అవగాహన లేకపోయినా.. నాకు కావాల్సినవి ఎప్పటికప్పుడు అందిస్తూ నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. ఇప్పుడే కాదు నా చిన్నతనం నుండి వాళ్లు ఇలానే పెంచారు. ఈ క్రమంలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు కూడా. మా వాళ్లు పడ్డ కష్టాలు నాకు తెలుసు.
అందుకే వారు గర్వపడేలా నేను మరింత సాధించాల్సి ఉంది అని చెప్పింది. రష్మిక మందన. రష్మిక మందన సినిమాల గురించి చూస్తే… ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప: ది రూల్’, ‘రెయిన్‌బో’ సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు ‘భీష్మ’ ట్రయో రిపీట్‌ను చేస్తూ… నితిన్‌తో వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. ఇక హిందీలో రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ అనే సినిమాలో నటిస్తోంది.
విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?