Rashmika, Vijay: ‘గుడ్‌ ఫుడ్‌’.. రష్మిక దాచింది… నెటిజన్లు క్లారిటీ ఇచ్చేశారు.. ఇక నో డౌట్‌!

  • November 25, 2024 / 10:58 AM IST

విజయ్ దేవరకొండ, రష్మిక మందన లవర్సా అంటే.. అవును అని క్లారిటీగా చెప్పేస్తారు నెటిజన్లు. అయితే ఈ విషయంలో ఎక్కడా, ఎప్పుడు, ఎవరూ అధికారికంగా చెప్పలేదు. అయితే లేదు అని కూడా చెప్పలేదు అనుకోండి. అయితే మొన్నీమధ్యే ‘35 ఏళ్లు వచ్చాక కూడా నేను సింగిల్‌గా ఉంటానా?’ అని విజయ్‌ దేవరకొండ దాదాపు క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు రష్మిక కూడా అదే పని చేసిందా? ఆమె రీసెంట్‌గా పోస్ట్‌ చేసిన ఫొటోతో అలానే ఉంది.

Rashmika, Vijay

అయితే నెటిజన్లు ఆ ఫొటోను డీకోడ్‌ చేసి, మరికొందరు అన్‌సీన్‌ పిక్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి వారి బంధం గురించి పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. మీరు పైన చూస్తున్న ఫొటోలు అవే మరి. దీన్ని ఓ ఆర్డర్‌లో చూస్తే.. తొలుత ‘గుడ్‌ ఫుడ్‌’ అంటూ రష్మిక మందన ఓ ఫొటోను సోషల్‌ మీడియలో షేర్‌ చేసింది. అందులో ఐస్‌క్రీమ్‌ కాంబినేషన్‌ను ఆరగిస్తున్నట్లు అర్థమవుతోంది.

ఆమె ఎవరితో కలసి ఆ ఐస్‌క్రీమ్‌ తింటోంది అనే విషయం మాత్రం అక్కడ ట్యాగ్‌ చేయలేదు. ఆ ఫొటో ఎవరు తీశారు అనేది కూడా చెప్పలేదు. కానీ అభిమానులు, నెటిజన్లు ఊరుకుంటారా? ఇది ఆ ఫొటో తీసింది ఈయనే, ఆమెతో కలసి డిజర్ట్‌ తిన్నది ఈయనే అంటూ ఓ ఫొటోను షేర్‌ చేశారు. ఆ ఫొటోలో ఉన్నది మరెవరో కాదు.. చాలా ఏళ్లుగా పుకార్లలో ఉన్న లవర్‌ విజయ్‌ దేవరకొండనే.

‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన ఆన్‌స్క్రీన్‌ జోడీ విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు ఎంతో కాలం నుండి వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరూ ఇటీవల ఓ రెస్టరెంట్‌ డేట్‌కి వెళ్లినట్లున్నారు. అక్కడి ఫొటోనే ఇప్పుడు వైరల్‌గా మారి, ‘విష్మిక’ (విజయ్‌ – రష్మిక) విషయంలో బయటకు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇక వీళ్లు మళ్లీ క్లారిటీ ఇవ్వక్కర్లేదు. మనం అడగక్కర్లేదు అని అర్థమవుతోంది. అన్నట్లు మొన్నీమధ్య రష్మిక పండగలను విజయ్‌ ఇంట్లోనే జరుపుకుంటోంది అని తెలిసింది.

నేను ఎవర్ని చేసుకుంటాను అనేది ఆల్రెడీ అందరికీ తెలుసు: రష్మిక

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus