Rashmika, Vijay: రష్మిక మాటలకు పనులకు పొంతనే లేదుగా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ దేవరకొండ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న మధ్య ఏదో ఉందని ఇప్పటికే చాలా సందర్భాల్లో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విజయ్ దేవరకొండ నటించి డిజాస్టర్ గా నిలిచిన లైగర్ సినిమా సైతం తనకు ఎంతగానో నచ్చిందని రష్మిక తాజాగా వెల్లడించారు. ఈరోజు రష్మిక నటించిన గుడ్ బై మూవీ థియేటర్లలో విడుదలైంది. అయితే లవ్లీ జోడీగా పేరు సంపాదించుకున్న విజయ్ రష్మిక తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు.

విజయ్ దేవరకొండ రష్మిక కలిసి మాల్దీవులకు టూర్ కు వెళ్లారని సమాచారం. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వర్క్ లైఫ్ నుంచి రెస్ట్ తీసుకోవాలనే ఆలోచనతో విజయ్, రష్మిక ఈ టూర్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది. ముంబై ఎయిర్ పోర్ట్ లో విజయ్, రష్మిక వేర్వేరుగా కనిపించడంతో ఈ వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్తలపై విజయ్, రష్మిక ఎలా స్పందిస్తారో చూడాలి.

లైగర్ సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను అందుకోవడంతో నిరాశకు లోనైన విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమాలో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా ఈ సినిమాలో నటిస్తుండగా శివనిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక పుష్ప ది రూల్ సినిమాతో బిజీగా ఉన్నారు. విజయ్ రష్మిక కొన్ని నిమిషాల గ్యాప్ లోనే ముంబై ఎయిర్ పోర్ట్ లో సందడి చేయడం గమనార్హం.

తమ మధ్య ప్రేమ లేదని రష్మిక చెబుతున్నా ఆమె ప్రవర్తన మాత్రం విజయ్ తో ప్రేమలో ఉందని అభిప్రాయం కలగటానికి కారణమవుతూ ఉండటం గమనార్హం. అయితే ఇదే సమయంలో విజయ్ రష్మిక కలిసి మరిన్ని సినిమాలలో నటించాలని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ రష్మిక సినిమాలలో కలిసి నటించడానికి ఓకే చెబుతారో లేదో చూడాలి. విజయ్, రష్మిక కలిసి నటించిన సినిమాలలో గీతా గోవిందం సక్సెస్ సాధిస్తే డియర్ కామ్రేడ్ మూవీ ఫ్లాప్ గా నిలిచింది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus