Rashmika: రష్మిక బాక్సాఫీస్ రికార్డులలో 3 వేల కోట్లు!

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇప్పుడు ఇండియన్‌ సినిమాల్లో టాప్‌ హీరోయిన్‌గా నిలిచింది. యానిమల్  (Animal) , పుష్ప 2 (Pushpa 2: The Rule), ఛావా (Chhaava).. వరుసగా మూడు బిగ్‌ బ్లాక్‌బస్టర్స్‌ ఆమె ఖాతాలోకి వచ్చాయి. గత రెండేళ్లలో ఏ హీరోయిన్‌కి రాలేని స్థాయిలో బాక్సాఫీస్‌ రికార్డులు ఆమె పేరు మీద నమోదయ్యాయి. మూడు సినిమాల కలిపి మొత్తం గ్రాస్‌ వసూళ్లు దాదాపు రూ.3000 కోట్లను దాటాయి. ఇలాంటి ఫీట్ సాధించిన ఏకైక హీరోయిన్‌గా రష్మిక చరిత్రలో నిలిచిపోనుంది.

Rashmika

2023లో విడుదలైన యానిమల్ సినిమా రూ.900 కోట్ల మార్కును దాటింది. ఇందులో రణబీర్‌ కపూర్‌తో (Ranbir Kapoor) కలిసి నటించిన రష్మిక, తన గీతాంజలి పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా సక్సెస్‌ అనంతరం, పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపింది. రూ.1800 కోట్ల భారీ వసూళ్లతో ఇండియన్‌ సినిమా చరిత్రలో దంగల్ తర్వాతి స్థానాన్ని దక్కించుకుంది. అలాగే బాహుబలి 2ను వెనక్కి నెట్టి, రెండో స్థానం సంపాదించింది.

ఇదే జోరు కొనసాగిస్తూ, రష్మిక నటించిన ఛావా కూడా భారీ వసూళ్లు రాబడుతోంది. హిందీలోనే కాదు, తెలుగులోనూ ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. లాంగ్‌ రన్‌లో వెయ్యి కోట్ల మార్కును దాటే అవకాశముందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మూడు సినిమాలు కలిపి చూస్తే రష్మిక బాక్సాఫీస్‌ వసూళ్లు రూ.3000 కోట్లను దాటినట్లు ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.

బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్లుగా గుర్తింపు పొందిన దీపికా పదుకొణే (Deepika Padukone), ఆలియా భట్‌ (Alia Bhatt) కూడా ఈ స్థాయిలో రికార్డులు నమోదు చేయలేకపోయారు. వరుస బిగ్‌ బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చినప్పటికీ, రష్మిక స్థాయికి చేరలేదని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పుడు రష్మిక సికిందర్తో (Sikandar) మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతోంది. ఈ సినిమా కూడా భారీ విజయం సాధిస్తే, ఆమె వసూళ్లు 4000 కోట్ల మార్కును టచ్‌ చేసే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మే 9ని ఖాళీగా వదిలేస్తున్నారా.. కన్ఫ్యూజన్లో నితిన్ సినిమా యూనిట్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus