Rashmika: మా ఇద్దరి దారులు వేర్వేరు.. విజయ్ తో రిలేషన్ పై రష్మిక రియాక్షన్!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక.. ఇప్పుడు బాలీవుడ్ లో సత్తా చాటడానికి ప్రయత్నిస్తోంది. రీసెంట్ గా ఈమె నటించిన ‘గుడ్ బై’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా రిలీజ్ కు ముందే మాల్దీవ్స్ కి చెక్కేసింది రష్మిక. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. ఎవరితోనైనా రిలేషన్ లో ఉన్నారా..? అని రష్మికను ప్రశ్నించగా..

‘నువ్ మాకోసం అవైలబుల్ గా ఉండడం లేదని’ ఇప్పటికే ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ చెబుతున్నారని.. రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు అవతలివారికి చాలా సమయం ఇవ్వాలని.. చాలా ఓర్పుతో ఉండాలని రష్మిక చెప్పింది. రిలేషన్ కాపాడుకోవడం కోసం చాలా ప్రయత్నించాలని.. ప్రస్తుతం తనకు అంత టైం లేదని అంటోంది రష్మిక. వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నానని.. రాబోయ్ రోజుల్లో ఏదైనా ఉంటే చెబుతానని తెలిపింది. ఇదే సమయంలో విజయ్ దేవరకొండ గురించి కూడా మాట్లాడింది.

ఇదివరకు వీరిద్దరిపై కొన్ని రూమర్స్ వినిపించాయి. ఈ ఏడాది ఇద్దరూ ఒకేసారి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. దీని వెనుక ఏమైనా కారణం ఉందా..? అని రష్మికను ప్రశ్నించగా.. కెరీర్ ఆరంభంలో ఇద్దరం(విజయ్, రష్మిక) భారీ హిట్ సినిమాలు చేశామని.. ఇప్పుడు విజయ్ పాన్ ఇండియా సినిమా చేశారని.. తను స్ట్రెయిట్ హిందీ సినిమా చేశానని రష్మిక తెలిపింది.

‘గుడ్ బై’ తనకు హిందీలో తొలి సినిమా అని.. నిజానికి ఈ సినిమా రెండేళ్లక్రితం విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా ఆలస్యమైందని చెప్పింది. ‘లైగర్’ విడుదల కూడా కరోనా కారణంగా లేట్ అయిందని.. ఇద్దరి సినిమాలు ఒకేసారి రావడం అనుకోని చేసిందైతే కాదని చెప్పింది. విజయ్ తో ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలే మాట్లాడతానని.. మా ఇద్దరి దారులు వేర్వేరు అని రష్మిక చెప్పుకొచ్చింది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus