Rashmika: కెరియర్ పై ఆసక్తికర పోస్టు చేసిన రష్మిక!

  • December 30, 2023 / 07:01 PM IST

రష్మిక మందన్న భాషతో సంబంధం లేకుండా తెలుగు తమిళ హిందీ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈమె ఇండస్ట్రీకి కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా అడుగు పెట్టారు. ఈమె మొట్టమొదటిసారి కన్నడలో కిరిక్ పార్టీ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకోవడంతో అనంతరం తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రష్మిక ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. పెద్ద ఎత్తున బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈమె కన్నడ చిత్ర పరిశ్రమలో నటించిన మొట్టమొదటి సినిమా కిరిక్ పార్టీని విడుదలయ్యి నేటికి సరిగా ఏడు సంవత్సరాలు పూర్తి కావడంతో ఈమె ఆ సినిమా విశేషాలను గుర్తు చేసుకున్నారు.

ఈమె (Rashmika) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏడు సంవత్సరాలు పూర్తి ఆయన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే తన సినీ కెరియర్ గురించి కూడా రష్మిక సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ఈమె పోస్ట్ చేస్తూ కొన్నిసార్లు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదంతా ఎలా జరిగింది అనిపిస్తుంది.

ఏమి తెలియకుండానే పరుగులు తీశాను. కానీ సరైన వ్యక్తులతో ఉండటం వల్ల ఆలోచించి అడుగులు వేసానని ఈ సందర్భంగా రష్మిక తన కెరియర్ గురించి చెప్పడమే కాకుండా నా కల నెరవేరింది అంటూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈమె షేర్ చేసినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో పాటు పుష్ప సీక్వెల్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus