Rashmika in Maldives: మాల్దీవుల్లో తనివి తీరా ఎంజాయ్ చేస్తున్న రష్మిక.. వైరల్ అవుతున్న గ్లామర్ ఫోటోలు..!

రష్మిక మందన తెలుగు,కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడిప్పుడే బాలీవుడ్లో కూడా పాపులర్ అవుతుంది. ‘పుష్ప’ ‘సీతా రామం’ చిత్రాలు ఆమెకు పాన్ ఇండియా ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. ఈ మధ్యనే ఈమె నటించిన బాలీవుడ్ స్ట్రైట్ మూవీ ‘గుడ్ బై’ కూడా రిలీజ్ అయ్యి క్రిటిక్స్ నుండి ప్రశంసలు అందుకుంటుంది. ఇందులో ఆమె లాయర్ తార పాత్రలో నటించింది. ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. సో రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ గా సెటిల్ అయినట్టే..! అందుకే రష్మిక ఏదో ఒక వార్తలో నిలుస్తుంటుంది.

ముఖ్యంగా ఈమె విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉందనే వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఈ మధ్యనే బి టౌన్ లో కూడా వీరి గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా… ఇటీవల విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి మాల్దీవులకు ట్రిప్ వేసినట్టు సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ నడిచింది. అందుకు వీళ్ళు కలిసి దిగిన ఫోటోలు అయితే లేవు కానీ.. విజయ్ దేవరకొండ కళ్ళజోడు మాత్రం రష్మిక పెట్టుకున్నట్టు ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇది నిజమో కాదో అన్న విషయం మాత్రం రష్మిక క్లారిటీ ఇవ్వలేదు.

మరోపక్క ఈమె మాల్దీవుల్లో తనివి తీరా ఎంజాయ్ చేస్తుంది. స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తూనే, బీచ్ వద్ద హాట్ హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాకి వేడెక్కించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus