Rashmika: అలా మసాజ్ చేస్తే.. రష్మిక పోస్ట్ వైరల్!

కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సౌత్ లోనే కాకుండా.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా సత్తా చాటడానికి సిద్ధమవుతోంది. వరుస సినిమాలతో కెరీర్ లో చాలా బిజీగా గడుపుతోంది రష్మిక. ఇక ఈ బ్యూటీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత చెప్పుకున్నా తక్కువే. సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుంది రష్మిక. నేషనల్ క్రష్ అనే ట్యాగ్ ను కూడా సొంతం చేసుకుంది.

అందుకే ఆమె చేసినా.. కూడా వైరల్ అవుతూ ఉంటుంది. ఆమెకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. రీసెంట్ గా రష్మిక ఓ కుక్కపిల్లను అడాప్ట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దానికి ‘ఆరా’ అనే పేరు కూడా పెట్టుకుంది. ఎప్పటికప్పుడు తన పెట్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

మొన్నామధ్య దానికి లిప్ లాక్ కూడా ఇచ్చింది. ఇక తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఓ వీడియో షేర్ చేసింది రష్మిక. ఈ వీడియోతో మరోసారి తన ఆరాపై ఉన్న ప్రేమను వ్యక్థపరిచింది. సోఫాలో ఉన్న కుక్కపిల్లకు మసాజ్ చేస్తూ.. దానికి అలా చేయడమంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. మసాజ్ చేయగానే.. పడుకుండిపోయిందని తెలిపింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus