తెలుగులో పూజా హెగ్డే, రష్మిక మందన వంటి స్టార్ హీరోయిన్ల హవా ఎక్కువగా నడుస్తుంది. పూజ ఎలాగూ ఇప్పుడు బాలీవుడ్ ప్రాజెక్టులతో కూడా బిజీగా ఉంది. దీంతో హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉన్న కోలీవుడ్ కాస్త.. ఇప్పుడు రష్మిక వైపు చూస్తుంది. ఈమెకు అక్కడి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నప్పటికీ.. ఈమె వెంటనే అంగీకరించడం లేదు. ఆమెకు సినిమా పై నమ్మకం ఉంటేనే చేస్తుంది లేదంటే ఏదో ఒక కారణం చెప్పేసి స్కిప్ చేసేస్తోంది.
తాజాగా ఓ స్టార్ హీరో సినిమాని కూడా రష్మిక పక్కన పెట్టేసిందట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు మన సూర్య. ఇతని తమ్ముడు కార్తీ నటించిన ‘సుల్తాన్’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది రష్మిక. ఆ రిఫరెన్స్ తో సూర్య సినిమాలో నటించమని రష్మిక ను సంప్రదించారట. కానీ ఆమె ఇప్పుడు వరుస ప్రాజెక్టులకు సైన్ చెయ్యడం వల్ల ఈ సినిమాలో నటించలేను అని చెప్పిందట. దాంతో ఇప్పుడు ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ను ఎంపిక చేసుకున్నారని సమాచారం.
పాండిరాజ్ డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. నిజానికి ప్రియాంక అరుళ్ మోహన్ మొదటి చిత్రం తరువాత బిజీ అయిపోతుంది అని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కాస్త లేట్ అయినప్పటికీ.. మంచి ఆఫర్లనే దక్కించుకుంటుంది ఈ బ్యూటీ. శర్వానంద్ హీరోగా నటించిన ‘శ్రీకారం’ చిత్రంలో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. ఆ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది.