Rashmika Mandanna, Allu Arjun: బన్నీపై హాట్ కామెంట్స్ చేసిన రష్మిక!

  • September 16, 2021 / 09:20 PM IST

ఛలో, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు విజయాలతో గోల్డెన్ లెగ్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తున్నారు. బన్నీతో తొలిసారి కలిసి నటిస్తున్న రష్మిక చేతిలో బాలీవుడ్ ఆఫర్లు కూడా ఉన్నాయనే సంగతి తెలిసిందే. పుష్పతో టాలీవుడ్ లో మరో బ్లాక్ బస్టర్ సాధిస్తానని రష్మిక నమ్మకంతో ఉన్నారు. తాజాగా ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బన్నీ కళ్లు అంటే తనకు చాలా ఇష్టమని ఆ విషయం బన్నీకి కూడా చెప్పానని రష్మిక పేర్కొన్నారు.

సినిమాలో హీరో అల్లు అర్జున్, విలన్ ఫహద్ తమ కళ్లతోనే బెస్ట్ ఇవ్వడం తాను చూశానని ఆమె చెప్పుకొచ్చారు. రియల్ లొకేషన్స్ లోనే ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా జరిగిందని రష్మిక అన్నారు. దాదాపు 70 శాతం సన్నివేశాలను రియల్ లొకేషన్లలో షూట్ చేశామని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. రష్మిక ఇంటర్వ్యూల ద్వారా ఆ అంచనాలను మరింత పెంచుతున్నారు. రష్మికకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయలకు అటూఇటుగా రష్మిక తీసుకుంటున్నారని తెలుస్తోంది.

డిసెంబర్ 17వ తేదీన పుష్ప పార్ట్1 రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇస్తారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus