టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన రష్మికకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. రష్మికను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. యానిమల్ సినిమా గురించి రష్మిక మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. యానిమల్ సినిమాలోని హింసాత్మక సన్నివేశాల గురించి సైతం రష్మిక తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. నటీనటులు వారి పాత్రకు 100 శాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తారని ఆమె అన్నారు. సినిమాను ఆదరించాలా లేదా అనేది ప్రేక్షకుల స్వేచ్చపై ఆధారపడి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
యానిమల్ సినిమాలో రణ్ బీర్ రోల్ భార్యకు, కుటుంబానికి ఎంతో గౌరవం ఇస్తుందని రష్మిక చెప్పుకొచ్చారు. తన వాళ్లను కాపాడుకోవడానికి ఆ పాత్ర ఎంత సాహసమైనా చేసేందుకు సిద్ధపడుతుందని రష్మిక అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులకు ఆ రోల్ కచ్చితంగా నచ్చాలనే రూల్ లేదని ఆమె తెలిపారు. ఆ రోల్ నచ్చడం నచ్చకపోవడం ప్రేక్షకుల అభిరుచిపై ఆధారపడి ఉంటుందని ఆ విషయం నేను పట్టించుకోనని సినిమాను ఎంతోమంది ఆదరించారని రష్మిక తెలిపారు.
తన రోల్ గురించి రష్మిక మాట్లాడుతూ నేను దర్శకుడి ఊహకు ప్రాణం పోయాలని భావించే నటినని డైరెక్టర్ చెప్పినట్లు చేయడం నా కర్తవ్యం అని అన్నారు. సీన్ బాగా వచ్చేవరకు ఎన్ని టేక్స్ అయినా చేస్తానని ఆమె తెలిపారు. గీతాంజలి చాలా ధైర్యవంతురాలని రియల్ లైఫ్ లో కూడా గీతాంజలిలా జీవించేవారు నాకు తెలుసని రష్మిక వెల్లడించారు.
వాళ్లకోసం ఈ పాత్రను స్వేచ్చగా చేశానని (Rashmika) రష్మిక పేర్కొన్నారు. ప్రస్తుతం రష్మిక పుష్ప ది రూల్ లో నటిస్తున్నారు. ఆగష్టు నెల 15వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. పుష్ప ది రూల్ తో రష్మిక కెరీర్ బెస్ట్ హిట్ ను సొంతం చేసుకుని రికార్డ్ లు క్రియేట్ చేస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రష్మిక రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లోనే ఉంది.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!