టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకొని పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయినటువంటి నటి రష్మిక మందన్న ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈమె బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ సంపాదించుకుంది.
ఇక ఈ సినిమా విడుదలైన అనంతరం రష్మిక క్రేజ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో మరింత పెరిగిపోయిందని చెప్పాలి. ఇదిలా ఉండగా తాజాగా రష్మికకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిక బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక స్టార్ హీరో చెంప చెల్లు మనిపించారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా 20 సార్లు ఆ హీరో పై ఈమె చేయి చేసుకున్నారనే విషయం తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.
మరి రష్మిక చేతిలో తన్నులు తిన్నటువంటి ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే… యానిమల్ సినిమా డైరెక్టర్ తమ్ముడు ప్రణయ్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ రష్మిక రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమాలో కర్వా చౌత్ సన్నివేశం చేసే సమయంలో రష్మిక (Rashmika) అతనిని కొడుతుంది అయితే ఈ షార్ట్ తీయడం కోసం దాదాపు 20 టేకులు తీసుకున్నామని తెలిపారు.
ఇలా ప్రతి టేక్ తీసుకొని సమయంలో రష్మిక రణబీర్ చెంప పై దెబ్బ కొట్టింది అంటూ ఈ సందర్భంగా ప్రణయ్ రెడ్డి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక చిన్న షాట్ తీయడం కోసం 20 టేకులు తీసుకున్నారా ఇది నిజంగా అవమానమే అంటూ కొందరు ఈ వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.
డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!