Bigg Boss 7 Telugu: రెచ్చిపోయిన రతిక.. ఇచ్చిపారేసిన శోభ..! లైవ్ లో ఏం జరిగిందంటే.?

  • November 7, 2023 / 12:22 PM IST

బిగ్ బాస్ హౌస్ లో 10వ వారం నామినేషన్స్ లో భాగంగా హౌస్ మొత్తం బిగ్ బాస్ రాజ్యంగా మారింది. ఆడవాళ్లు అందరూ రాజమాతలుగా అయ్యారు. మిగతా వాళ్లు ప్రజలుగా నామినేషన్స్ లో తమ వాదనలని వినిపించారు. ఇక్కడే ఆఖర్లో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. రాజమాతల్లో కూడా ఒకరికొకరు మాట్లాడుకుని ఏకాభిప్రాయంతో ఒకరిని నామినేట్ చేయాల్సిందిగా చెప్పాడు. దీంతో ఎవరి ఆర్గ్యూమెంట్స్ వాళ్లు పెట్టారు. అయితే, శోభాశెట్టి కెప్టెన్ కాబట్టి ఈవారం తనని నామినేట్ చేయకూడదని చెప్పాడు. దీంతో ప్రియాంక అశ్వినిని, అశ్విని తిరిగి ప్రియాంకని నామినేట్ చేసుకున్నారు.

ఇక రతిక కూడా ప్రియాంకని టార్గెట్ చేస్తూ నామినేట్ చేసింది. ఇక శోభాశెట్టి ఓటు కీలకంగా మారింది. దీంతో రతికని నామినేట్ చేసింది. నువ్వు ఒక్కసారి ఎలిమినేట్ అయి తిరిగి వచ్చినా కూడా జల్ అవ్వడం లేదు. లాస్ట్ టైమ్ కూడా హౌస్ లో ఇలాగే చేశావ్. నీకు రెండో ఛాన్స్ ఇచ్చినా వినియోగించుకోవట్లేదు అంటూ నామినేషన్ కి రీజన్ చెప్పింది. అంతేకాదు, ఇక్కడ అందరిలో వీక్ కంటెస్టెంట్ నువ్వే అంటూ దెప్పిపొడిచింది. దీంతో రతిక నేను కాదు వీక్, నువ్వే వీక్ కంటెస్టెంట్ వి అని చెప్పింది.

దీనికి శోభా ఫస్ట్ లేడీ కెప్టెన్ అయ్యాను, అలాగే ఫస్ట్ లేడీ హౌస్ మేట్ ని కూడా అయ్యాను. నన్ను వీక్ అని చెప్తున్నావ్ అంటూ మాట్లాడింది. ఇద్దరూ మాటకి మాట అనుకున్నారు. యూస్ లెస్ పాయింట్స్ అంటూ రతిక గొణుక్కుంది. ఇక్కడే ప్రియాంకకి ఇంకా రతికకి ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయ్. అయినా కూడా శోభాశెట్టి రతికని నామినేషన్స్ లో పెడుతున్నామని చెప్పేసరికి రతికకి కోపం వచ్చింది. అందేంటి , ఇద్దరికీ 2ఓట్లు సమానంగా వచ్చాయని చెప్పింది.

దీంతో రియలైజ్ అయిన శోభా డెసీషన్ బిగ్ బాస్ కి వదిలేస్తూ, కెప్టెన్ గా నన్ను తీస్కోమంటే తీస్కుంటా అని ఒక హింట్ ఇచ్చింది. ఇక్కడే రతిక నువ్వే వీక్, జనాలు పంపించేస్తారేమో చూస్కో అంది. దీనికి శోభా రియాక్ట్ అయ్యింది. అలాగే తేజ వెళ్లిపోతుంటే ఏమన్నావ్, ఇంట్లో ఉండాలంటే భయమేస్తోందన్నావ్, తర్వాత సందీప్ వెళ్లేటపుడు కూడా ఇదే అన్నావ్, అదేనా అని అడిగితే, నాకు కనక్ట్ అయ్యారు వాళ్లు, నువ్వు వెళ్లేటపుడు నాకు అస్సలు ఫీల్ రాలేదు. ఎందుకంటే, నువ్వు అస్సలు కనెక్టే అవ్వలేదంటూ శోభా మాట్లాడింది. గేమ్ ఆడట్లేదని జల్ అవ్వకుండా ఇక్కడ ఎవరూ లేరని రతిక చెప్పింది.

ఇక్కడే ఇట్స్ ప్యూర్లీ పర్సనల్ అంటూ శోభా వెటకారంగా మాట్లాడేసరికి, జల్ కాదు నాకు నువ్వు ఆఫ్ట్రాల్ అంటూ నోరుజారింది రతిక. ఏంటి అని శోభా మళ్లీ అడిగినా కూడా ఇదే మాట చెప్పింది. నువ్వు నాకు అఫ్ట్రాల్ అంటూ మాట్లాడింది. రతికకి మాటాకి మాట తూటాలా పేల్చుతూ శోభాశెట్టి ఇచ్చిపారేసింది. ఫైనల్ గా నాకు నువ్వు ఆఫ్ట్రాల్ అంటూ రతిక రెచ్చిపోయింది. ఇక బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) ఆదేశం మీరకు కెప్టెన్ శోభాశెట్టి నిర్ణయం తీస్కుని రతికని నామినేట్ చేసింది. మొత్తానికి రాజమాతల ఆర్గ్యూమెంట్ నామినేషన్స్ లో హైలెట్ గా నిలిచింది. అదీ మేటర్.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus