Ramayana: హర్ట్ అవ్వొద్దు బాస్.. ఇది ‘రామాయణ’ కాదు.. ‘రావణాయణ’
- October 31, 2026 / 02:11 PM ISTByFilmy Focus Desk
‘రామాయణ’ సినిమా గురించి గత కొన్ని రోజులుగా ఎవరైనా మాట్లాడితే కచ్చితంగా ఓ టాపిక్ డిస్కషన్‌కి వస్తోంది. అదే ఈ సినిమాలో రాముడి కంటే రావణుడిని హైలైట్ చేస్తున్నారు అని. ఈ మాట మీరు కూడా వినే ఉంటారు. సినిమాల గురించి పూర్తిగా తెలిసినవారు అయితే మీరు కూడా ఈ మాట అనే ఉంటారు. లేదంటే ఇప్పుడు సినిమా గురించి రకుల్ ప్రీత్ సింగ్ చెప్పిన మాటలు వింటే కచ్చితంగా అదే మాట అంటారు. ఎందుకంటే కొత్త శూర్పణఖను చూస్తారు మీరు అని చెప్పింది మరి రకుల్.
Ramayana
నితేశ్ తివారీ దర్శకత్వంలో రెండు పార్టులుగా ‘రామాయణ’ సినిమా తెరకెక్కుతోంది. తొలి పార్టును దీపావళి కానుకగా నవంబరు 5న విడుదలవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓసారి రకుల్ ప్రీత్ సింగ్ లుక్ బయటకు వచ్చింది. ఇప్పుడు సినిమా టీమ్ మరోసారి విడుదల చేసింది. ఈ క్రమంలో ‘జనస్థాన యువరాణి శూర్పణఖ..’ అని రాసుకొచ్చింది. ఈ పాత్ర గురించి రకుల్ మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది. దీంతో ఈ సినిమాకు వేరే పేరు పెడితే బాగుండు అనే చర్చ మొదలైంది.

శూర్పణఖ పాత్ర పోషించడం ప్రత్యేకమైన అనుభవం. రామాయణ యుద్ధానికి ప్రధాన కారణాల్లో శూర్పణఖ ఒకరు. చాలామందికి ఈ విషయం తెలియదు. ఆమెను అందరూ అపార్థం చేసుకున్నారు. ఈ సినిమాలో శూర్పణఖని కొత్త కోణంలో చూపించబోతున్నాం. అలాంటి పాత్రను పోషిస్తున్నందుకు సంతోషంగా ఉంది అని చెప్పింది. అంటే ఇప్పటివరకు ‘రామాయణ’ సినిమాల్లో చూపించిన విధానానికి భిన్నంగా శూర్పణఖ పాత్ర ఈ సినిమాలో ఉండబోతోందన్నమాట.
రావణుడిగా యశ్ నటిస్తున్న ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం అయితే.. తొలి పార్టు ‘రామాయణ’లో రావణుడి పాత్రనే ఎక్కువసేపు కనిపిస్తుందట. సుమారు గంటపాటు రావణుడు కనిపిస్తాడట. శూర్పణఖ పాత్ర నిడివి కూడా ఎక్కువగానే ఉంటుందట. రావణుడికి ఇలా ఎక్కవసేపు చూపించి.. రెండోపార్టు రాముడిని ఎక్కువసేపు చూపించే అవకాశం ఉందట. ఇదంతా చూస్తుంటే.. ఎవరూ హర్ట్ అవ్వకూడదు అని చెబుతూ.. తొలి పార్టును ‘రావణాయణం’ అని అనొచ్చేమో.















