ఈ మధ్య కాలంలో స్టార్ హీరో రవితేజ రెమ్యునరేషన్ కు సంబంధించిన విషయాల ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. క్రాక్ సక్సెస్ తర్వాత రవితేజ తన రెమ్యునరేషన్ ను ఊహించని స్థాయిలో పెంచారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అన్ స్టాపబుల్ షోలో తన రెమ్యునరేషన్ గురించి స్పందిస్తూ రవితేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ఫ్లాప్ అయితే తాను కొంత రెమ్యునరేషన్ ను తిరిగిచ్చేస్తానని రవితేజ చెప్పుకొచ్చారు. రవితేజ చెప్పిన ఈ విషయాన్ని విని అభిమానులు సంతోషిస్తున్నారు.
సినిమా ఫ్లాప్ అయిన సమయంలో హీరోలు, దర్శకులు నిర్మాతను ఆదుకుంటే ఇండస్ట్రీ బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రవితేజను మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నామని రవితేజ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు తన కెరీర్ లోని డిజాస్టర్ల గురించి కూడా రవితేజ స్పందించారు. అప్పట్లో తాను ఓ కళా ఖండంలో నటించానని ఆ సినిమా పేరు అమర్ అక్బర్ ఆంటోని అని రవితేజ చెప్పుకొచ్చారు. బాలయ్య ఆ సినిమాను చూడకుండా మంచి పని చేశారని ఆ సినిమాను చూడాల్సిన అవసరం లేదని రవితేజ కామెంట్లు చేశారు.
బాలయ్య రాడ్డా? రాడ్ రంబోలా అని అడగగా రాడ్లకే రాడ్ సినిమా అని అమర్ అక్బర్ ఆంటోని గురించి రవితేజ కామెంట్లు చేశారు. రవితేజ కామెంట్లకు బాలయ్య పగలబడి నవ్వారు. అయితే సినిమాలో నటించిన హీరోనే సినిమా గురించి బ్యాడ్ గా చెప్పడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు శ్రీనువైట్ల దర్శకుడు అనే సంగతి తెలిసిందే. రవితేజ కామెంట్ల వల్ల శ్రీనువైట్ల హర్ట్ అవుతారని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అయితే శ్రీనువైట్ల మంచి స్నేహితుడు కావడం వల్లే రవితేజ ఆ సినిమా గురించి ఓపెన్ అయ్యి ఉంటారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రవితేజ అమర్ అక్బర్ ఆంటోనిపై చేసిన కామెంట్ల గురించి శ్రీనువైట్ల స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!