వైరల్ అవుతున్న రవితేజ కొత్త లుక్?

సినిమా కోసం హీరోలు లుక్స్ మారుస్తుంటారు. కథ డిమాండ్ చేసినందుకు అలా లుక్స్ మారుస్తుంటారు. అవి పెద్ద మార్పులా అనిపించవు. కానీ రవితేజ మాత్రం ఎప్పుడూ లేని విధంగా ఓ కొత్త లుక్కులో కనిపిస్తున్నాడు. అసలు ఈ ఫొటోలో ఉన్నది రవితేజనా ? అనేంతలా ఆ ఫోటో ఉంది. ఇప్పటి వరకూ ఏమాత్రం లుక్ మార్చని రవితేజ సడెన్ గా ఈ కొత్త లుక్కులో కనిపించే సరికి ప్రేక్షకులు ఆశ్చర్య పోతున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

ప్రస్తుతం వి.ఐ.ఆనంద్ డైరెక్షన్లో ‘డిస్కో రాజా’ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ చిత్రం కోసం లైట్ గెడ్డంతో ఉన్న లుక్ కి మంచి స్పందన లభించింది. సినిమాలో ప్లాష్ బ్యాక్ లో రవితేజ ఈ లుక్ లో కనిపించబోతున్నాడు. అయితే ‘పేస్ యాప్’ యూజ్ చేసి ఆ లుక్ ను మరింత యంగ్ చేసి సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ ‘పేస్ యాప్’ వచ్చాక… ఏ ఫోటో ఎవరిదో తెలియడం లేదు. ముందుముందు ఇంకా రవితేజలా ఎంతమంది హీరోలను ఇలాంటి లుక్స్ లో చూడాల్సి వస్తుందో..!

1

2

3


Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus