మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ

టచ్ చేసి చూడు సినిమా తర్వాత రవితేజ చేస్తున్న సినిమా నేల టికెట్. సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం విజయాల తర్వాత కళ్యాణ్ కృష్ణ చేస్తున్న సినిమా ఇది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చేనెల 24న రిలీజ్ కానుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్, స్టిల్స్ తో పాటు రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ విపరీతమైన లైకులు అందుకుంది. వేగంగా మిలియన్ వ్యూస్ అందుకుంది. నకిలీ డాక్టర్ గా రవితేజ ఇందులో హాస్యం పండించనున్నారు. ఎస్‌ఆర్‌టీ మూవీస్‌ పతాకంపై రామ్ తాళ్లూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రవితేజ ఈ సినిమా తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించనున్నారు.

“అమర్ అక్బర్ ఆంటోనీ” కోసం అమెరికాకు వెళ్లనున్నారు. త్వరలో ఈ మూవీ షూటింగ్ లో రవితేజ జాయిన్ కానున్నారు. తాజాగా మరో సినిమాకి కూడా రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాలను తెరకెక్కించిన వి ఐ ఆనంద్ చెప్పిన కథ రవితేజకి బాగా నచ్చిందంట. అందుకే వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం నేల టికెట్ సినిమాని నిర్మిస్తున్న బ్యానర్ లోనే ఈ మూవీ కూడా నిర్మింతం కానుంది. ఈ చిత్రానికి డిస్కో రాజా అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus