Ravi Teja: రవితేజ కొత్త సినిమా అప్‌డేట్‌.. ప్రెస్టీజియస్‌ సినిమాలో అలా కనిపిస్తాడా?

రవితేజ (Ravi Teja) ఇప్పుడు తన ప్రెస్టీజియస్‌ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. కెరీర్లో కీలకమైన 75వ సినిమా చేస్తున్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi)  , సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల  (Sreeleela) కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం హోల్డ్‌లో ఉన్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ సినిమాలో రవితేజ పాత్ర రైలు చుట్టూ తిరుగుతుంది అని చెబుతున్నారు. అంటే రైల్వేలో పని చేసే ఓ అధికారిగా కనిపిస్తారట. వచ్చిన సమాచారం కరెక్ట్ అయితే..

Ravi Teja

రవితేజ ఈ సినిమాలో సీఆర్పీఎఫ్‌ అధికారిగా కనిపిస్తాడట. మన దగ్గర హీరోలు ఎక్కువగా మిలటరీ, నేవీ, పోలీసుగా కనిపిస్తూ ఉంటారు. సీఆర్పీఎఫ్ అధికారులుగా కనిపించేది చాలా తక్కువ. కాబట్టి రవితేజ కొత్తదనం కోసం అలా చేశాడు అనొచ్చు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌లో ప్రమాదవశాత్తూ రవితేజ గాయపడిన విషయం తెలిసిందే. దీంతో చిత్రీకరణకు తాత్కాలికంగా బ్రేక్‌ ఇచ్చారు. ఆయన త్వరగా కోలుకుంటున్నారని.. త్వరలో షూటింగ్‌ ఉంటుంది అని సన్నిహిత వర్గాల సమాచారం.

ఈ క్రమంలోనే రవితేజ ఈ సినిమాలో రైల్వే పోలీస్‌ ఫోర్స్‌ (ఆర్పీఎఫ్‌) అధికారిగా కనిపించనున్నట్లు వార్తలొచ్చాయి. ఇక ఈ సినిమా చిత్రీకరణ 40 శాతం పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. మామూలుగా అయితే ఈ సినిమాను సంక్రాంతికే తీసుకొస్తాం అని అనుకున్నారు. కానీ ఈ గ్యాప్‌ వల్ల సినిమా అప్పుడు రానట్లే. దీంతో వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు.

ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. తన పాత సినిమా ‘ఈగిల్‌’ (Eagle)  డైరెక్ట్‌ చేసిన కార్తీక్‌ ఘట్టమనేని (Karthik Gattamneni) ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ‘కోహినూర్‌’ అనే పేరును పరిశీలిస్తున్నారు. సినిమాలో ఆయన పాత్ర చిత్రణ ప్రకారం ఆ పేరు అయితే బాగుంటుంది అని చిత్రబృందం భావిస్తోందట. దసరాకు ఈ విషయంలో క్లారిటీ వస్తుంది అని చెబుతున్నారు.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో కోలీవుడ్ స్టార్ హీరో నటిస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus