ఓ పక్క హీరోలంతా స్టార్ హీరోయిన్లతో కలిసి నటించాలనుకుంటుంటే.. మాస్ మహారాజ రవితేజ మాత్రం కొత్త హీరోయిన్లకు అవకాశాలు ఇస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న ‘ఖిలాడి’ సినిమాలో డింపుల్ హయతి (గద్దలకొండ గణేష్ ఫేమ్), మీనాక్షి చౌదరి(ఇచట వాహనములు నిలుపరాదు ఫేమ్)లను హీరోయిన్లుగా తీసుకున్నారు. అలానే శరత్ మండవ దర్శకత్వంలో చేయనున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్, రజిష విజయన్ లతో రొమాన్స్ చేయబోతున్నారు.
ఇప్పుడు మరో అప్ కమింగ్ హీరోయిన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. చాలా కాలంగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మధ్యలో సినిమా ఆగిపోయిందని అన్నారు. ఆ కథ వరుణ్ తేజ్ దగ్గరకు వెళ్లిందని అన్నారు. కానీ ఈ సినిమా రవితేజతోనే చేయబోతున్నట్లు త్రినాధరావు నక్కిన అన్నారు. చాలా సిట్టింగ్స్ తరువాత రవితేజ ఓకే చెప్పారని అన్నారు.
ప్రసన్నకుమార్ తో కలిసి చాలా రోజులుగా ఇదే కథ మీద పని చేస్తున్నట్లు త్రినాధరావు నక్కిన తెలిపారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ శ్రీలీలను తీసుకోబోతున్నారు. తెలుగులో ‘పెళ్లి సందD’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది శ్రీలీల. ఇప్పుడు రవితేజ సినిమాలో ఆమెకి అవకాశం దక్కింది. అయితే ఈ కుర్ర భామ రవితేజ పక్కన సూట్ అవుతుందో లేదో మరి!
Most Recommended Video
‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?