మాస్ మహారాజా రవితేజ కెరీర్ గ్రాఫ్ ఇప్పుడు కొంచెం డేంజర్ జోన్ లోనే ఉంది. రీసెంట్ గా వచ్చిన ‘మాస్ జాతర’ నిరాశపరచడంతో ఆయన అర్జెంట్ గా గేర్ మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. సంక్రాంతికి ‘భక్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో వస్తున్నా, ఆ తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయం మాత్రం ఇండస్ట్రీని సర్ ప్రైజ్ చేస్తోంది. ఇన్నాళ్లు రొటీన్ మాస్ మసాలా కథలే చేసిన రవితేజ, ఇప్పుడు రూట్ మార్చి ఏకంగా భయపెట్టడానికి రెడీ అవుతున్నారట.
లేటెస్ట్ టాక్ ప్రకారం టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో రవితేజ ఒక సినిమా చేయబోతున్నారు. నానితో ‘సరిపోదా శనివారం’ లాంటి హిట్ కొట్టిన వివేక్, రవితేజ కోసం ఒక డిఫరెంట్ హర్రర్ సబ్జెక్ట్ ను సిద్ధం చేశారట. ఈ కథ వినగానే మాస్ రాజా ఎక్సైట్ అయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని టాక్. రవితేజ తన పాతికేళ్ల కెరీర్ లో ఎప్పుడూ పూర్తి స్థాయి హర్రర్ సినిమా చేయలేదు.
కానీ ఇప్పుడున్న కాంపిటీషన్ లో నిలబడాలంటే ఏదో ఒక కొత్త అటెంప్ట్ చేయక తప్పదు. రొటీన్ ఫైట్లు, పాటలు చూసి జనం బోర్ ఫీల్ అవుతున్నారు. అందుకే వివేక్ ఆత్రేయ లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ తో ఈ ప్రయోగం చేయడానికి సిద్దమయ్యారు. వివేక్ కూడా ఇప్పటిదాకా లవ్, యాక్షన్ కథలే డీల్ చేశారు. ఇప్పుడు ఆయన కూడా హర్రర్ జోనర్ టచ్ చేయడం ద్వారా తనలోని మరో కోణాన్ని చూపించబోతున్నారు.
ఇదే కాకుండా శివ నిర్వాణతో కూడా ఒక క్రైమ్ స్టోరీ ప్లానింగ్ లో ఉంది. అంటే రవితేజ తన రెగ్యులర్ ఇమేజ్ నుంచి బయటకు రావాలని గట్టిగానే ఫిక్స్ అయ్యారు. ‘ధమాకా’ తర్వాత సరైన హిట్ లేని లోటును, ఈ కొత్త ప్రయోగాలతో తీర్చాలని చూస్తున్నారు. మాస్ రాజా దెయ్యంతో చేసే ఈ కొత్త యుద్ధం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.