ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ ది స్క్రీన్ లో కూడా రవితేజను బీట్ చేయడం ఎంతటి యంగ్ హీరోకైనా కష్టమే. సినిమాల్లో అయితే ఆయన ఎనర్జీ లెవల్ కి రీచ్ అవ్వడం కోసం, ఆయనతో సమానంగా డ్యాన్సులు చేయడం కోసం హీరోయిన్లు నానా ఇబ్బందులుపడుతుంటారు. కానీ ఎట్టకేలకు రవితేజను బీట్ చేసే కుర్రాడొచ్చాడు. అతనెవరో యంగ్ హీరో అనుకోకండి, స్వయంగా ఆయన తనయుడు మహాధన్. ఇవాళ విడుదలైన “రాజా ది గ్రేట్” సినిమాలో జూనియర్ రవితేజగా కనిపించిన మహాధన్.. తన నటనతో ప్రేక్షకులను దాదాపుగా ఆశ్చర్యపరిచాడు.
అంధుడిగా రవితేజ కంటే బెటర్ గా పెర్ఫార్మ్ చేశాడని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మాస్ మహారాజా అభిమానులు కూడా రవితేజ తనయుడ్ని వెండితెరపై చూసుకొని మురిసిపోతున్నారు. తొలి సినిమాతోనే ఆడియన్స్ ను ఆకట్టుకొన్న మహాధన్ ను చూసుకొని రవితేజ సైతం ఆనందానుభూతి చెందుతున్నాడు. ఇకపోతే.. “రాజా ది గ్రేట్” ఎబౌ యావరేజ్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ పరంగా హిట్ కొట్టే దిశగా దూసుకుపోతోంది.