Virupaksha: ఆ ప్రముఖ నటుడు విరూపాక్షలో రవికృష్ణ రోల్ ను మిస్ అయ్యాడా?

కార్తీక్ దండు డైరెక్షన్ లో తెరకెక్కిన విరూపాక్ష మూవీ ఏ స్థాయిలో సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతర భాషల్లో కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫుల్ రన్ లో ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో రవికృష్ణ కీలక పాత్రలో నటించి తన నటనతో మెప్పించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవికృష్ణ మాట్లాడుతూ మొదట తను పోషించిన పాత్ర కోసం కార్తీక్ రత్నంను సంప్రదించారని తెలిపారు. కార్తీక్ రత్నంకు డేట్ల విషయంలో సమస్య రావడంతో ఆ పాత్ర కోసం నన్ను ఎంపిక చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. విరూపాక్ష సక్సెస్ తో రవికృష్ణకు సినిమా ఆఫర్లు కూడా పెరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నటుడు సీరియళ్లకు దూరంగా ఉంటూ సినిమాలలో ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

విరూపాక్ష (Virupaksha) సక్సెస్ తో రవికృష్ణ పారితోషికం సైతం భారీ రేంజ్ లో పెరిగిందని సమాచారం అందుతోంది. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో కష్టాలను అనుభవించిన రవికృష్ణ విరూపాక్ష సక్సెస్ తో కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదనే చెప్పాలి. సీరియల్స్ ద్వారా కూడా రవికృష్ణ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు.

రవికృష్ణ సీరియళ్లలో నటించిన సమయంలో రోజుకు 40,000 రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకునేవారని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాల ద్వారా రవికృష్ణకు అంతకంటే ఎక్కువగానే పారితోషికం దక్కుతోందని సమాచారం అందుతోంది. కెరీర్ విషయంలో రవికృష్ణ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రవికృష్ణ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలలో కూడా రవికృష్ణకు అవకాశాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus