టాలీవుడ్‌లో కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చే అతి కొద్దిమంది హీరోల్లో రవితేజ ఒకడు. హిట్ ట్రాక్‌లో ఉన్నామా, సరైన హిట్లు లేని సమయం ఉన్నామా అనేది పట్టించుకోకుండా కొత్త కుర్రాళ్లకు దర్శకుడిగా అవకాశం ఇస్తూ ఉంటాడు. అలా ఇండస్ట్రీకి వచ్చినవారిలో గోపీచంద్ మలినేని, కేఎస్ రవీంద్ర (బాబి) ఉన్నారనే విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి కొత్త దర్శకుణ్ని పరిచయం చేసే పనిలో పడ్డాడు రవితేజ. ‘ఖిలాడీ’ తర్వాత మాస్ మహారాజ్ చేసే సినిమా కొత్త దర్శకుడితోనేనట.
‘సర్దార్ గబ్బర్‌సింగ్’, ‘కాటమరాయుడు’ లాంటి సినిమాలకు పని చేసిన గులాబి శ్రీను అనే కొత్త కుర్రాడు గతేడాది రవితేజకు పాయింట్ చెప్పాడట. గులాబి శ్రీను ‘క్రాక్’ సినిమాకు కో డైరక్టర్‌గా కూడా పని చేశాడు. అంతే కాదు ఆ సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు కూడా. ఆ క్రమంలోనే గతేడాది రవితేజకు ఓ కథ చెప్పాడట. అది నచ్చడంతో పూర్తి చేయమని చెప్పాడట. ప్రస్తుతం గులాబి శ్రీను అదే పనిలో ఉన్నాడట. వినోదాత్మకంగానే ఉంటూనే… రవితేజలో కొత్త కోణం చూపించేలా ఈ సినిమా ఉండబోతోందట.
ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’ పనుల్లో బిజీగా ఉన్నాడు. రమేశ్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోంది. ఆ తర్వాత ఏ గులాబి శ్రీను సినిమా ఉండబోతోందట. అయితే పూరి జగన్నాథ్ కథను కూడా రవితేజ విన్నాడని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఏది ముందు మొదలవతుందో చూడాలి.
Most Recommended Video
జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?