Ravi Teja: కష్టాల్లో ఉన్న నిర్మాతను అదుకున్న స్టార్ హీరో..!

  • October 29, 2023 / 11:25 PM IST

మాస్ మహారాజా రవితేజ… ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లోనే టైర్ 1 హీరో స్థాయికి ఎదిగాడు. చిన్న చిన్న సైడ్ పాత్రలు చేసుకునే స్థాయి నుంచి టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. అంటే.. భూపతిరాజు రవిశంకర్ రాజు (రవితేజ) ఎంత కష్టపడ్డాడో తెలిసిపోతుంది. అయితే రవితేజ డౌన్ టూ ఎర్త్ కాబట్టి.. కష్టం విలువ తెలుసు కాబట్టి… ఎవరికి నష్టాలు వచ్చినా చూస్తు ఊరుకోడు. తన వంతు సాయం చేస్తూనే ఉంటాడు.

ఇక ఆయన సినిమాలకు నష్టాలు వస్తే.. ప్రొడ్యూసర్లదే బాధ్యత అని ఎప్పుడూ అనుకోలేడు. తనకు రావాల్సిన రెమ్యునరేషన్ నుంచి కొంత భాగం రిటర్న్ ఇస్తాడు. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమాకు మంచి మనసున్న భూపతి రాజు అదే పని చేశాడు. సినిమా రన్ టైం ఎక్కువ ఉండడమో… సెకండాఫ్ అంత గ్రిప్పింగ్ గా లేకపోవడమో ఇంకా ఇతర కారణాలో… టైగర్ నాగేశ్వరరావు సినిమాకు మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది.

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు నెగిటివ్ టాక్ వచ్చి, జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయిన తర్వాత మేకర్స్ రన్ టైం కుదించారు. కానీ, డ్యామేజ్ ఇప్పటికే జరిగిపోయింది. సినిమా చూడటానికి ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు అనేది ఒప్పుకోవాల్సిన నిజం.

అంతే కాదు, ప్రొడ్యూసర్లకు 25 కోట్ల వరకు నష్టం వచ్చే ప్రమాదం ఉందని కూడా సినీ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. ఇది ముందే తెలిసిన రవితేజ… తన వంతు సాయంగా, తీసుకున్న 18 కోట్ల రెమ్యునరేషన్ నుంచి 2 కోట్లను నిర్మాత అభిషేక్ అగర్వాల్ కు తిరిగి ఇచ్చేశారట. అంటే.. టైగర్ నాగేశర్వరావు సినిమాకు రెమ్యునరేషన్ కు సంబంధించి రవితేజ (Ravi Teja) ఫైనల్ సెటిల్మెంట్ చేసేసుకున్నాడని తెలుస్తుంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus