Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

‘ఊరూ వాడా’ అంటూ ఓ కార్యక్రమాన్ని ఘనంగా ప్రకటించిన తారక్‌ అభిమాన సంఘం ‘RAW NTR’ ఆ తర్వాత వివిధ పరిణామాల మధ్య ఆ కార్యక్రమాన్ని నిలిపేసింది. ఆ కార్యక్రమం ప్రకటించిన ఎన్టీఆర్‌ అభిమాని సాయి రూప్‌.. ఒకానొక సందర్భంలో ఎన్టీఆర్‌ వచ్చి చెబితే తప్ప ఈ కార్యక్రమం ఆపను అని చెప్పారు. ఆ మాట అన్నాక కొంతమంది వ్యక్తిగతం సాయి రూప్‌పై విమర్శలు చేశారు. ఇందులో ఇతర వర్గాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ‘ఊరూ వాడా’ కార్యక్రమం నిలిపేస్తున్నట్లు RAW NTR ప్రకటించి ఆశ్చర్యపరిచింది.

Raw Ntr

ఏమైంది.. ఎందుకు ఆపేశారు అనే ప్రశ్నలు వచ్చాయి. వాటికి టీమ్‌ నుండి ఎలాంటి స్పందనా రాలేదు. అయితే ఇప్పుడు మరో యాంగిల్‌లో స్పందన వచ్చింది. ‘ఊరూ వాడా’ కార్యక్రమానికి ముందు రాఎన్టీఆర్‌ టీమ్‌ చాలా ఏళ్లు నిర్వహించిన ‘ఎన్టీఆర్‌ మీల్‌’ కార్యక్రమాన్ని కూడా నిలిపేస్తున్నట్లు ప్రకటిచింది. లక్షలాది మంది నిరుపేదల ఆకలి తీర్చిన ఎన్టీఆర్ మీల్ సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు అధికారికంగా టీమ్‌ ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 150కి పైగా కేంద్రాల్లో పర్యటించి, కొరియర్ల ద్వారా దాదాపు 2,000కు పైగా ఎన్టీఆర్ మీల్ కిట్లను పంపిణీ చేశామని, ప్రస్తుతం ఈ కార్యక్రమం ముగుస్తున్న నేపథ్యంలో, కిట్లు పొందిన వారందరూ వాటిని వీలైనంత త్వరగా చెన్నైలోని తమ ప్రధాన కార్యాలయానికి పంపించాలని టీమ్‌ కోరింది. మొత్తం మీద ఇప్పటివరకు 2000 కంటే ఎక్కువ కిట్లను పంపిణీ చేసి, లక్షలాది మంది ఆకలిని తీర్చడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించిందని సమాచారం.

ఇప్పుడు ఈ కార్యక్రమం నిలిపివేయడం చూస్తుంటే సాయి రూప్‌ ఎంతగా హర్ట్‌ అయ్యారో అర్థమవుతోంది. ఈ నిర్ణయం వెనుక కారణమేంటి అనేది రాఎన్టీఆర్‌ టీమ్‌ చెప్పలేదు. దీనికి ‘ఊరూ వాడా’ రద్దుకు ఏమన్నా కారణం ఉందా అనేది కూడా తెలియడం లేదు.

 స్ట్రాంగ్‌ ఫరియా ఇలా ఏడ్చేసిందేంటి? ఏమైందంటే?

https://www.youtube.com/watch?v=E1ZT4StDFZM

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus